e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home యాదాద్రి టీకాతోనే రక్షణ

టీకాతోనే రక్షణ

టీకాతోనే రక్షణ
  • స్వీయ నియంత్రణ పాటించకపోతే భారీ నష్టం
  • టీకా విషయంలో అపోహలొద్దు.. అన్ని టీకాలు సమర్థమైనవే
  • పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ నెలాఖరు నాటికి అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్‌
  • వైరస్‌ వ్యాప్తి నిరోధానికి పటిష్ట ఏర్పాట్లు
  • ‘నమస్తే తె లంగాణ’తో డీఎంహెచ్‌వో సాంబశివరావు

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్‌ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ వేగంగా వ్యాప్తి ముఖ్యంగా గతవారం, పది రోజుల నుంచి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో స్వీయ నియంత్రణ పా టించడం తప్పనిసరి. కానీ..ఈ విషయంలో కొందరు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. విధిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటిస్తే వ్యాప్తిని అరికట్టవచ్చు. భోజనం, అల్పాహారం, ఇతర పదార్థాలను తినేముందు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి. సామూహిక కార్యక్రమాలు, వేడుకలకు వెళ్లకపోవడమే మంచిది. వచ్చే రెండు నెలలపాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎం తైనా ఉందని డీఎంహెచ్‌వో సాంబశివరావు అన్నారు. ఇలా చేస్తే వైరస్‌ కట్టడికి వీలుంటుందన్నారు.

పైలట్‌ ప్రాజెక్టుగా అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకా
అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకా ఇచ్చేందుకుగాను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ జిల్లాను పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఈ మేర కు జిల్లాలో 60ఏండ్లకు పైబడిన వారు 63,519 మంది, 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సువారు 83,372 మంది ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వీరిలో ఇప్పటికే కొంతమందికి టీకా ఇవ్వడం జరిగింది. మిగతా వారందరికీ ఈ నెలాఖరు నాటికి టీకాలు ఇచ్చేలా కార్యాచరణను రూపొందించి అమలుచేస్తున్నాం. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో మొన్నటివరకు ప్రతిరోజూ వంద టెస్టులు చేశారు. ఇకపై ప్రతి పీహెచ్‌సీ పరిధిలో 300 టెస్టులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో 500 చొప్పున టెస్టులు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తంగా ప్రతిరోజూ 7వేల టెస్టులు చేయాలని నిర్దేశించడం జరిగింది.

టీకాలపై అపోహలు వద్దు
టీకాలపై అపోహలు తొలగించడానికి మావంతుగా కృషి చేస్తు న్నాం. ఇప్పటికీ చాలామంది టీకాలను తీసుకునేందుకు ముం దుకు రావడంలేదు. సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయన్న దానిపై ఎక్క డా కూడా నిర్ధారణ కాలేదు. అందువల్ల మనం భయపడాల్సిన పనిలేదు. ఏ టీకా తీసుకోవాలన్న దానిపై కూడా చాలామంది లో సందిగ్ధత నెలకొంది. అన్ని టీకాలు సమర్థవంతమైనవే. రెండు డోసులు తీసుకున్న 15 రోజుల తర్వాత యాంటీబాడీ లు వృద్ధ్ది చెందుతున్నాయి. టీకా తీసుకున్న తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొవిడ్‌ సోకే అవకాశాలు ఉన్నాయి. అయితే టీకాలు పొందినవారిలో ఎవరూ కూడా తీవ్రమైన అనారోగ్యం బారినపడిన దాఖలాల్లేవు. ఏ రకంగా చూసినా టీకా వంద శాతం రక్షణనిచ్చేదే.

కరోనాపై యుద్ధానికి సర్వం సిద్ధం
కరోనాపై యుద్ధ్దానికి సర్వం సిద్ధ్దంగా ఉన్నాం. అన్ని శాఖల సమన్వయంతో సమర్థవంతంగా వైరస్‌ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్‌ శాఖలతో తరచుగా కలెక్టర్‌ సమక్షంలో సమీక్షలు నిర్వహించి కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అప్రమత్తం చేస్తున్నాం. ముఖ్యంగా మాస్కులు ధరించకపోవడం, గుంపులు గుంపులుగా చేరిపోవడం, చేతులు శుభ్రపర్చకపోవడం వంటి కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. స్వీయ నియంత్రణ పాటించకున్నా.. మాస్కులు ధరించకున్నా.. భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పోలీస్‌ శాఖ సహకారం కూడా తీసుకుంటున్నాం. మాస్కు ధరించని వారికి జరిమానాలు విధించి అవగాహన కల్పించాల్సిందిగా సూచిస్తు న్నాం. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచి మందుల ను అందిస్తున్నాం. చికిత్స అవసరమై తే భువనగిరి ఏరియా దవాఖాన, బీబీనగర్‌ ఎయిమ్స్‌ లో అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాం

వ్యాక్సిన్‌ కొరత లేదు..
జిల్లాలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌తోపాటు 45-60 మధ్య వయస్కులు, 60 ఏళ్లకు పైబడినవారు ఇప్పటివరకు 22,604 మంది మొదటి డోస్‌ తీసుకోగా..4,081 మంది సెకం డ్‌ డోస్‌ తీసుకున్నారు. కొవిడ్‌ వ్యాప్తి భయంతో ఇటీవలే కొవిడ్‌ టీకా తీసుకునేందుకు వివిధ వర్గాలవారు కేంద్రాలకు వస్తున్నారు. కేంద్రాలకు రప్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా తమవంతు సహకారం అందిస్తున్నారు. వ్యాక్సిన్‌ కొరత లేదు. కొవాగ్జిన్‌కు సంబంధించి 2 వేల వాయిల్స్‌, కొవిషీల్డ్‌కు సంబంధించి 5వేల వాయిల్స్‌ అందుబాటులో ఉన్నాయి.

ఇవీ కూడా చదవండి…

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

విదేశాలను వదిలి..సాగు బాటలో కదిలి..

ప్రకృతి ప్రేమికులు

Advertisement
టీకాతోనే రక్షణ
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement