e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home యాదాద్రి బోనం.. భాగ్యం

బోనం.. భాగ్యం

బోనం.. భాగ్యం
  • ఆషాడంలో ఆధ్యాత్మిక సందడి
  • బోనాల జాతర సంబరం
  • శుభ కార్యాలు లేని శూన్య మాసం
  • కొండంత పండుగ.. ఊరంతా వేడుక

ఆలేరుటౌన్‌, జూలై 11: బోనం.. అచంచల నమ్మకం స్వచ్ఛ మైన భక్తికి ప్రతిరూపం. వెళ్లివిరిసే ఆధ్యాత్మికతకు చిరునామా.. అంతా మంచే జరుగాలని కోటి మొక్కులతో మనఃస్ఫూర్తిగా స మర్పించే రూపం.. సనాతన ఆచారానికి నిదర్శనం. అచ్చ తెలు గు వస్త్రధారణలో మహిళలు.. కనుల పండువగా సాగే ఊరేగిం పు. ఇలా ఎన్నెన్నో.. అంతా కలిసి ఆషాఢంలో పండుగ సంద డి. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బోనాల పండుగ. తెలం గాణ సంస్కృతిలో ‘ దేవి ’ అమ్మవారి ముఖ్య ఉత్సవాల్లో బో నాల పండుగ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతి ఏటా ఆషా ఢ మాసం మొదట్లో ప్రారంభమై నెలాఖరు వరకు కొనసాగు తుంది. ఆషాఢ మాసంలో ఆషాఢ బహుళ విధియ మొదటి ఆదివారం నిర్వహించే మొదటి బోనంతో తెలంగాణలో పండు గ సంబురాలు ప్రారంభమవుతాయి.

నైవేద్యం
ఉత్సవంలో అత్యంత కీలకమైనది బోనం. ఇది భోజనం అన్న పదానికి రూపాంతరంగా వచ్చిందని పండితులు చెబుతారు. మట్టి, ఇత్తడి, రాగి, మిశ్రమ లోహాలతో రూపొందించిన పాత్ర కు సున్నం, జాజు, పసుపు, కుంకుమలతో బొట్లు పెడతారు. వేప కొమ్మలతో, సుగంధ ద్రవ్యాలతో అలంకరిస్తారు. అమ్మవా రికి అత్యంత ఇష్టమైన పదార్థాలతో రూపొందించిన పరమ న్నాన్ని నైవేథ్యంగా ఉంచుతారు. అమ్మవారిని ఆవాహం చేసి మహిళల నెత్తిన మోస్తూ వీధుల్లో తిరుగుతారు. తమకు అంతా మంచే జరుగాలని, వర్షాలు కురిసి గ్రామ సీమలు పాడి పంటల తో కళకళలాడాలని మొక్కుకుంటారు. బోనాన్ని నైవేథ్యంగా సమర్పిస్తారు. అనంతరం దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. అ లాగే వివాహం కాని యువతులు బోనం ఎత్తుకుంటే పెండ్లి జరుగుతుందనే విశ్వాసం ఉంది.

- Advertisement -

బోనం పాత్ర.. వేపాకుల సాక
ఆషాఢ జాతరలో బోనాలకు చిరకాలంగా ప్రత్యేకత ఉంది. బోనంగా వ్యవహరించే ఓ పాత్రలో దేవికి తమ ప్రసాదాన్ని దాఖలు చేసే ఘట్టాన్ని బోనాలుగా వ్యవహరిస్తారు. మహిళలు తమ ఇండ్లలో ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన దు స్తులు ధరించి మడితో వారు మొక్కుకున్న ప్రకారం బోనం ప్ర సాదాన్ని తయారు చేస్తారు. ఓ పాత్రలో పెట్టి అపవిత్రం కాకుం డా దీపాన్ని వెలిగించి తలపై పెట్టుకొని అమ్మ వారికి సమర్పిం చి మొక్కులు తీర్చుకుంటారు. పసుపు నీటినే ఆ పాత్రలో నిం పుకొని వేప మండలను వాటిలో ఉంచుతారు. దేవత కొలువు దీరిన ప్రదేశానికి ఎదురుగా ఆ నీటిని సమర్పిస్తారు. దానినే ‘ సాక ’ అని వ్యవహిరిస్తారు. నీరు, వేపాకుల సమ్మేళనం ఏ రీతిలో చల్లగా ఉంటుందో తమను కూడా చల్లగా దీవించాల్సిం దిగా దేవతను కోరడమే ఈ సాక సమర్పణకు ఆచారం. విజ్ఞాన పరంగా కూడా పసుపు, వేప క్రిమిసంహారాలుగా పని చేస్తా యి. వీటిని వినియోగించడం ద్వారా రుగ్మతలను నివారించే అవకాశం ఉంది. సాధారణంగా ఆషాడ మాసంలోనే వర్షాలు విస్తారంగా కురుస్తాయి. కొత్త నీరు చేరడం, నీటి నిల్వల వల్ల వివిధ అంటురోగాలు ప్రబలకుండా పసుపు, వేప మండలాల వినియోగం ఉపకరిస్తుందని, ఈ ప్రక్రియనే సంప్రదాయబద్దం గా బోనాలుగా నిర్వహిస్తున్నారని చరిత్రకారుల అభిప్రాయం.

విశిష్టమాసం
ఆషాఢంలో చేసే పూజలు, నది స్నానాలు ఎంతో విశిష్టమైనవి. ఈ మాసంలో శుభకార్యాలు ఉండవు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున తొలి ఏకాదశి పండుగను జరుపుకొంటారు. జ్యోతిషం ప్రకారంగా సూర్యుడు నవగ్రహాలకు రాజు. ఒక్కో గ్రహం రాశి మారడం వల్ల వాతావరణంలో, ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతుంటాయి.వర్షాలు కురవడం, వాతావరణం చల్ల బడ డం, రైతులు పనుల్లో బిజీగా ఉండడం, తరుచూ అనారోగ్యాల వల్ల గృహ ప్రవేశాలు, శుభ కార్యాలు చేయడం నిషేధించారు. అలాగే కొత్తగా వివాహం చేసుకున్న దంపతులను ఆషాఢ మా సంలో దూరంగా ఉంచే సంప్రదాయం అనాదిగా వస్తుంది.

లోక కల్యాణం
లోకకల్యాణార్థం అమ్మవారి ఆలయా ల్లో శక్తి స్వరూపిణి అయిన తల్లిని ఆ వాహనం చేస్తారు.ఇది పాత సంప్ర దాయమే.పల్లెల్లో కూడా భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ నిర్వహిస్తున్నారు. శక్తిస్వరూపిణి అయిన అ మ్మవారిని కాళీమాత, దుర్గామాత, ఎల్లమ్మ, పోచమ్మ, మైస మ్మ, కనకదుర్గమ్మ రూపాల్లో కొలుస్తారు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో దేవతామూర్తిని ప్రత్యేకంగా అలంకరిస్తారు.

  • ఆలేటి రంగన్న, శ్రీకనకదుర్గా ఆలయ పూజారి, ఆలేరు

అస్తిత్వానికి ప్రతీక
బోనాల పండుగ తెలంగాణ అస్తిత్వా నికి ప్రతీక. ప్రతి ఏటా ఆషాడమాసం లో ప్రారంభమయ్యే బోనాల జాతర తో ప్రతిగ్రామంలో భక్తిభావం వెళ్లి వి రుస్తుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక పండుగలకు ప్రాధా న్యం పెరిగింది. హైటెక్‌ యుగంలోనూ బోనాల ఉత్స వాలకు ఆధారణ లభిస్తుందంటే అది అమ్మవారి పట్ల భక్తులకు ఉన్న విశ్వాసమే. – వంగపల్లి అంజయ్యస్వామి,
ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ ఆధ్యాత్మిక రాష్ట్ర కమిటీ చైర్మన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బోనం.. భాగ్యం
బోనం.. భాగ్యం
బోనం.. భాగ్యం

ట్రెండింగ్‌

Advertisement