e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home యాదాద్రి భయం వీడుదాం.. బాధ్యతగా ఉందాం

భయం వీడుదాం.. బాధ్యతగా ఉందాం

భయం వీడుదాం.. బాధ్యతగా ఉందాం
  • హోం ఐసొలేషన్‌లో ఉంటూనే కోలుకోవచ్చు
  • గుండె సంబంధిత వ్యాధులున్నా టీకా వేసుకోవచ్చు
  • కరోనాను గుర్తించి తక్షణం స్పందించడమే కీలకం
  • ‘నమస్తే డాక్టర్‌’ ఫోన్‌ ఇన్‌లో డాక్టర్‌ ఉదయ్‌కిరణ్‌
  • కరోనాపై అనుమానాల నివృత్తికి పెద్ద ఎత్తున ఫోన్లు చేసిన ప్రజలు

– (భువనగిరి టౌన్‌, మే 10):భయం వీడి బాధ్యతగా నిబంధనలు పాటించి మెలిగితే కరోనాను దూరం చేయవచ్చని భువనగిరి ఏరియా దవాఖాన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ చంద్రగిరి ఉదయ్‌కిరణ్‌ అన్నారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఆధ్వ ర్యంలో సోమవారం నిర్వహించిన ‘నమస్తే డాక్టర్‌ ’ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలు పెద్ద ఎత్తున ఫోన్‌ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. మాస్క్‌, భౌతిక దూరం ఇవే కరోనాను దూరం చేస్తాయని తెలిపారు. పాజిటివ్‌ వస్తే భయపడొద్దన్నారు. లక్షణాలు గుర్తించి వెంటనే సరైన మందులు వాడటం ద్వారా ఇంటి వద్దే ఎంతో మంది కోలుకుంటున్నారన్నారు. యాక్టివ్‌ ఇన్‌ఫెక్షన్‌ (జ్వరం, జలుబు, నిమోనియా లాంటివి)ఇమ్మనోవ్‌ సబ్రసివ్‌ డిసీజెస్‌ (టీబీ, హెచ్‌ఐవీ లాంటివి) ఉన్నవారు తప్ప ఎవరైనా వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని స్పష్టం చేశారు.

సాధారణ జ్వరానికి, కొవిడ్‌ జ్వరానికి తేడా ఏమిటి? కొవిడ్‌ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– రమేశ్‌యాదవ్‌, రుస్తాపూర్‌, తుర్కపల్లి.

డాక్టర్‌ : సాధారణ జ్వరానికి, కొవిడ్‌ జ్వరానికి కొద్ది తేడా ఉంటుంది. సాధారణ జ్వరాల బారిన పడినవారిలో జలు బు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొవిడ్‌ బారిన పడిన వారిలో ఆ లక్షణాలతో పాటు మరికొన్ని అదనంగా కనిపిస్తాయి. ముఖ్యంగా తీవ్ర పొడి దగ్గు, కొద్ది దూరం నడిస్తేనే ఆయాసం, ఆహార పదార్థాల రుచి, వాస న తెలియకపోవడం, తీవ్ర ఒళ్లు నొప్పులు, ఛాతిలో నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా కొవిడ్‌ బారిన పడిన వారిలో ఒక్కో లక్షణం పెరుగుతుంది. కరో నా రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మాస్క్‌ ధరించ డంతో పాటు బయటకు వెళ్లినప్పుడు భౌతికదూరం పా టించాలి. బయటి వస్తువులు తాకినప్పుడు సబ్బుతో గానీ, శానిటైజర్‌తోగాని చేతులు శుభ్ర పర్చుకోవాలి. ఇం ట్లోకి కూడా శుభ్రం చేసుకున్నాకే వెళ్లాలి.

వ్యాక్సిన్‌ రెండు డోసులు వేయించుకున్నప్పటికీ మూడు రోజులుగా స్మెల్‌ ఇతర కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి ఎందుకు? ఏం చేయాలి? -రజనీకాంత్‌, భువనగిరి
డాక్టర్‌ : వ్యాక్సిన్‌ వేయించుకున్నా కరోనా వస్తుంది. అయితే వ్యాక్సిన్‌ వేయించుకోవడం వల్ల కరోనా వచ్చినా కేవలం ఇన్‌ఫెక్షన్‌ మాత్రమే వస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ పెరగదు తద్వారా డిసీస్‌ రాదు. ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. హోం ఐసోలేషన్‌లో ఉంటూ మందులు వాడితే తొందరగా తగ్గుతుంది. వ్యాక్సిన్‌ మొ దటి డోస్‌తో 50శాతం, రెండో డోస్‌ పూర్తితో 90 శాతం మీ ఆరోగ్యానికి కరోనా నుంచి ప్రోటక్షన్‌ లభిస్తుంది.

వ్యాక్సిన్‌ ఎవరు వేయించుకోవాలి? ఎవరు వేయించుకో వద్దు? డయాలసిస్‌ రోగులు వేయించుకోవచ్చా?-నక్కల చిరంజీవియాదవ్‌, విద్యానగర్‌, భువనగిరి
డాక్టర్‌ : జ్వరం, జలుబు, నిమోనియా లాంటి యాక్టివ్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వాళ్లతో పాటు టీబీ, హెచ్‌ఐవీ లాంటి ఇ మ్మనోవ్‌ సబ్రసివ్‌ డిసీజెస్‌ ఉన్న వాళ్లు తప్ప ఎవరైనా కరో నా టీకా వేయించుకోవచ్చు. డయాలసిస్‌ రోగులు డయా లసిస్‌ చేసుకున్న 48 గంటల తర్వాత గానీ, డయాలసిస్‌ చేసుకునే 24 గంటల ముందు గానీ వ్యాక్సిన్‌ వేయించు కోవచ్చు.

నాకు పాజిటివ్‌ వచ్చి 11 రోజులైంది. ప్రస్తుతం దగ్గు వస్తుంది ఏం చేయాలి? -క్రాంతి, రాంనగర్‌, భువనగిరి
డాక్టర్‌ : కరోనా బాధితులు కొద్దిమందిలో దగ్గు కొనసా గుతుంది. ఇలాంటి వారు గ్రీన్‌లిక్టస్‌ సిరఫ్‌ రోజుకు మూ డు సార్లు, టస్‌క్యూ ఓరల్‌ టాబ్లెట్లు రోజులో రెండుసార్లు మూడు రోజులు వాడాలి. విటమిన్‌ టాబ్లెట్లు తీసుకోవాలి

చిన్నారులకు కరోనా సోకుతుందా? లక్షణాలు ఎలా ఉంటాయి? -శ్రీనివాస్‌, రామన్నపేట
డాక్టర్‌ : చిన్నారులకు కరోనా సోకుతుంది. పెద్ద వాళ్లలో జ్వరం, జలుబు, దగ్గు తదితర ఎలాంటి లక్షణాలు కనిపి స్తాయో అవే లక్షణాలు చిన్నారుల్లోనూ కనిపిస్తాయి. వారి కి సంబంధించిన సిరప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు.

వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ తీసుకున్నాను. రెండో డోస్‌ ఎప్పు డు వేయించుకోవాలి? – దశరథగౌడ్‌, ఆత్మకూరు(ఎం)
డాక్టర్‌: మొదటి డోస్‌ తీసుకున్న 6వారాల తర్వాత రెండో డోస్‌ తీసుకోవాలి.

ఏప్రిల్‌ 28న ఇంట్లో అందరికీ కరోనా పాజిటివ్‌ వచ్చింది. కరోనా కిట్‌ వాడాం. తగ్గింది. నా భార్యకు తలనొప్పి, అల సట వస్తోంది. అసలు హోం క్వారంటైన్‌లో ఎన్ని రోజు లుండాలి? లక్షణాలు లేకున్నా మళ్లీ కరోనా పరీక్ష చేయిం చుకోవాలా?శ్రీనివాస్‌, చింతపల్లి, నల్లగొండ
డాక్టర్‌ : ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 రోజులు హోం క్వారంటైన్‌ ఉంటే సరిపోతుంది. కరోనా రావడం వల్ల రుచి తెలియక సరైన ఆహారం తీసుకోక పో వడంతో పాటు ఎండకాలం డీ హైడ్రేషన్‌ మూలంగా కూ డా తలనొప్పి, అలసట వచ్చే అవకాశం ఉంది. సరైన పో షకాహారం తీసుకోవడం ద్వారా దీనిని అధిగమించవ చ్చు. లక్షణాలు లేకుంటే కరోనా పరీక్ష చేయించుకోవా ల్సిన అవసరం లేదు. అయితే వృత్తి రీత్యా కరోనా రిపోర్టు అనివార్యమైతే కరోనా పరీక్ష మరోసారి చేయించుకుని నిర్ధారణ చేసుకోవచ్చు.

నాకు థైరాయిడ్‌ ఉంది. కరోనా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆవిరి తీసుకోవచ్చా? – కుయ్య కృష్ణవేణి, హౌజింగ్‌బోర్డు కాలనీ, భువనగిరి
డాక్టర్‌: థైరాయిడ్‌ ఉన్నవాళ్లు కరోనా సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. థైరాయిడ్‌ కంట్రోల్‌లో ఉం డేలా జీవన విధానాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఒక వేళ కరోనా వస్తే అందరూ తీసుకునే మాత్రలనే తీసుకోవాల్సి ఉం టుంది. తీవ్రతను బట్టి ట్రీట్మెంట్‌ ఉంటుంది. డాక్టర్లను సంప్రదించిన తర్వాత ఆవిరి తీసుకోవాలి. పదేపదే ఆవిరి పట్టడం వల్ల ఇతర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ముక్కు దిబ్బడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే తాత్కాలిక ఉపశమనం కోసం ఆవిరి తీసుకోవచ్చు. గోరు వెచ్చని నీరు మాత్రమే తాగాలి.

గర్భిణులకు కరోనా వస్తే ఏం చేయాలి? చిన్నారులకు పాలివ్వవచ్చా? – రమేశ్‌, బోగారం, రామన్నపేట
డాక్టర్‌ : డాక్టర్‌ను సంప్రదించాలి. వారు సూచించిన విధంగా మందులు వాడితే సరిపోతుంది. ఇబ్బందులు ఎక్కువైతే కరోనా బారిన పడిన గర్భిణుల డెలివరీ కోసం గాంధీ దవాఖానలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అ క్కడ చికిత్స పొందవచ్చు. డెలివరీ అయ్యాక చిన్నారులకు పాలివ్వొచ్చు. చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర వ్వవు. తల్లి పాలతో చిన్నారుల్లో యాంటీబాడీస్‌ పెరు గుతాయి.

ఈ నెల 7న ఒక దుకాణంలో కిరాణ సామాగ్రి తీసుకున్నా ను. అతనికి కరోనా పాజిటివ్‌గా 9న గుర్తించారు. అతని వస్తువులు తాకడం వల్ల నాకు కరోనా సోకుతుందా? ప్రస్తుతం నాకు లక్షణాలు లేవు ఏం చేయాలి? – వెంకట్‌రెడ్డి, మోత్కూరు
డాక్టర్‌ : వచ్చే అవకాశాలను తొసిపుచ్చలేం. మీరు, అత ను మాస్క్‌, భౌతిక దూరం పాటించి మీరు ఇంటికెళ్లగానే చేతులు, వస్తువులను శుభ్రపరచి ఉంటే కరోనా వచ్చే అవ కాశం తక్కువ ఉంటుంది. కరోనా వస్తే లక్షణాలు బయట పడతాయి. ప్రస్తుతం లక్షణాలు లేవంటున్నారు గనుక ధైర్యంగా ఉండండి.

నేను టీకా వేయించుకున్నా అయినప్పటికీ కరోనా వచ్చింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. రెండో డోస్‌ టీకా వేయించుకోవచ్చా?- పాండు, భువనగిరి
డాక్టర్‌: మొదటి డోస్‌ టీకా వేయించుకున్న తర్వాత కరో నా సోకిన వారు రెండో డోసు తీసుకోవచ్చు. దానివల్ల ఇబ్బందులేమీ ఉండవు. అయితే 4రోజుల తర్వాత కరో నా నెగటివ్‌ వచ్చిన తర్వాత మాత్రమే వేయించుకోవాలి.

మూడు, నాలుగు రోజులుగా జలుబు ఒక్కటే ఉంది. టెస్ట్‌ చేయించుకోవాలా? – నరేందర్‌, నీర్నెంల, రామన్నపేట
డాక్టర్‌: కరోనా సోకిన వారందరిలో అన్నీ లక్షణాలు కని పించవు. జలుబు మూడు నాలుగు రోజులుగా ఉందని చెబుతున్నారు కనుక తప్పనిసరిగా మీరు కరోనా టెస్ట్‌ చేయించుకోవాలి. అంతకుముందు మీరు మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భయం వీడుదాం.. బాధ్యతగా ఉందాం

ట్రెండింగ్‌

Advertisement