e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home యాదాద్రి సాగుకు సన్నద్ధం

సాగుకు సన్నద్ధం

సాగుకు సన్నద్ధం
  • జిల్లాలో సరిపడా విత్తనాలు, ఎరువులు
  • 75,805 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని అంచనా
  • అందుబాటులో 9,117 మెట్రిక్‌ టన్నుల ఎరువులు

భువనగిరి టౌన్‌, జూన్‌ 8 : జిల్లాలో వానకాలం సాగు ప్రారంభమైంది. మెట్ట, తరి భూముల్లోనూ రైతులు వ్యవసాయానికి ఉపక్రమించారు. మెట్ట ప్రాంతాల్లో పత్తిసాగుకు రైతులు ఇప్పటికే దుక్కు లు సిద్ధం చేశారు. ఇంకా చేయనివారు సైతం ఇటీవల కురిసిన వర్షాలతో దుక్కులు చదును చేయడంలో బిజీ అయ్యారు. బోర్లు, బావుల కింద వరి సాగు చేసే రైతులు రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో నారుమళ్లను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే వానకాలం సాగు ప్రణాళికను రూపొందించిన వ్యవసాయాధికారులు దానిని ఆచరణలో పెట్టారు. అధికారుల లెక్కల ప్రకారం అన్ని రకాల పంటలు కలిపి జిల్లా వ్యాప్తంగా 4,46,563 లక్షల ఎకరాలు సాగు కానున్నది. ఇందులో వరి, పత్తి పంటలదే అగ్రస్థానం. కాగా 2లక్షల ఎకరాల్లో వరి, 1,95,000 ఎకరాల్లో పత్తి, కందులు 46,000 ఎకరాల్లో, జొన్న, వేరుశనగ, మినుములు, ఉలవలు, ఆముదాలు, ఎర్రజొన్నలు, పొగాకు తదితర పంటలన్నీ కలిపి 5,563 ఎకరాల్లో సాగు కావొచ్చని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు సమకూర్చడంపై దృష్టి సారించారు.

విత్తనాలు సిద్ధం
వానకాలం సాగు ప్రణాళికలకు అనుగుణంగా విత్తనాలను వ్యవసాయాధికారులు రైతులకు అందుబాటులో ఉంచారు. 2లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని, అందుకనుగుణంగా 48వేల క్వింటాళ్ల వరి విత్తనాలను అందుబాటులో ఉంచారు. అదేవిధంగా 46వేల ఎకరాల కంది పంట సాగవుతుందని, అందుకు సంబంధించి 5వేల క్వింటాళ్ల కంది విత్తనాలను అందుబాటులో ఉంచారు. పత్తి సాగుకు సంబంధించి 1,95,000 ఎకరాల పత్తి సాగవుతుందని, దానికి గాను 3,90,000 ప్యాకెట్ల(450గ్రాముల ప్యాకెట్‌) బీజీ-1, బీజీ-2 విత్తనాలను అందుబాటులో ఉంచారు. బీజీ-1 పత్తి విత్తనాల ప్యాకెట్‌ ధరను రూ.635గా, బీజీ-2 పత్తి విత్తనాల ప్యాకెట్‌ ధరను రూ.767గా నిర్ణయించారు. అదేవిధంగా జొన్న, వేరుశనగ, మినుములు, ఉలవలు, ఆముదాలు, ఎర్రజొన్నలు, పొగాకు తదితర పంటలు సాగుకానున్న 5,563 ఎకరాలకు సంబంధించిన అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచారు.

అందుబాటులో ఎరువులు
వానకాలం సీజన్‌కు సంబంధించి యూరియా, డీఏపీ, ఎంవోపీ, కాంప్లెక్స్‌ ఎరువులన్నీ కలిపి 75,805 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 9,117మెట్రిక్‌ టన్నుల ఎరువులు అం దుబాటులో ఉన్నాయి. ఇందులో యూరి యా ఈ సీజన్‌కు సంబంధించి 33,898 మెట్రిక్‌ టన్నుల అవసరం కాగా ప్రస్తుతం 4,966 మెట్రిక్‌ టన్ను లు అందుబాటులో ఉన్నది. అదేవిధంగా డీఏపీ 13,969 మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా 301 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 5,588 మెట్రిక్‌ టన్ను లు అవసరం కాగా 306 మెట్రి క్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 22,350 మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా 3,544 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అవసరమయ్యే మేరకు ఎరువులు ప్రతినెలా జిల్లాకు చేరనున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సాగుకు సన్నద్ధం

ట్రెండింగ్‌

Advertisement