e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home యాదాద్రి పల్లె, పట్టణ ప్రగతికి..రూ.1040 కోట్లు మంజూరు

పల్లె, పట్టణ ప్రగతికి..రూ.1040 కోట్లు మంజూరు

చౌటుప్పల్‌, జూలై5: పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా అభివృద్ధి పనులకు ఇప్పటికే సీఎం కేసీఆర్‌ రూ.1040 కోట్లు మంజూరు చేశారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా తీర్మానించిన పనులను త్వరగా చేపట్టాలని సూ చించారు. చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొని మొక్కలను నాటారు. వా ర్డులోని డ్రైనేజీలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పల్లెలు, పట్టణాల అభివృద్ధికే సీఎం కేసీఆర్‌ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాల్లో తీర్మానించిన పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. గతంలో ఏ గ్రామంలో చూ సినా మంచినీటి పంచాయితీలు ఉండేవని, కానీ సీఎం కేసీఆర్‌ రూ.45వేల కోట్లతో చేపట్టిన మిష న్‌ భగీరథతో పంచాయితీలు పోయాయని, ఇం టింటికీ కుళాయిల ద్వారా మంచినీరు అందుతున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయన్నారు. పట్టణాభివృద్ధికి తన నిధుల నుంచి రూ. 5 లక్షలు మంజూ రు చేస్తున్నానని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ ప్రకటించారు.

గ్రామ స్వరాజ్యమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం
మహాత్మాగాంధీ కలలుకన్నా గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. గతంలో ఎప్పు డూ లేనివిధంగా గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ వేల కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ బత్తుల శ్రీశైలంగౌడ్‌, కౌన్సిలర్‌ కామిశెట్టి శైలజ, ఆర్టీఏ జిల్లా మెంబర్‌ తడక చంద్రకిరణ్‌, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ పిల్లలమర్రి శ్రీనివాస్‌, శాఖ గ్రంథాలయం చైర్మన్‌ మల్లేశ్‌గౌడ్‌, సింగిల్‌విండో డైరెక్టర్‌ శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement