e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home యాదాద్రి ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలి

ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలి

ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలి

చౌటుప్పల్‌ రూరల్‌,జూన్‌4: అర్హులైన ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని సర్పంచ్‌ కళ్లెం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవా రం మండల పరిధిలోని డి.నాగారంలో కోవాగ్జిన్‌ రెండో డోస్‌ టీకా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో హెచ్‌ ఈవో సత్యనారాయణ, వైద్యసిబ్బంది వేణుగోపాల్‌, సరళ, గోపీనాథ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి సూపర్‌స్ప్రెడర్స్‌కు టీకా
భువనగిరి టౌన్‌: పట్టణంలోని వాణిజ్య, వ్యాపారస్తులకు, కి రాణం, కూరగాయల దుకాణదారులకు శనివారం నుంచి ప్ర భుత్వ జూనియర్‌ కళాశాలలో, కొత్త బస్టాండ్‌లో టీకా వేస్తారని భువనగిరి మున్సిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ టీకా పంపిణీ పది రోజుల పాటు కొనసా గుతుందన్నారు. ఈ అవకాశాన్ని వాణిజ్య, వ్యాపారస్తులు, కి రాణం, దుకాణదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఆత్మకూరు(ఎం)లో 160 మందికి టీకాలు
ఆత్మకూరు(ఎం): మొదటి విడుత టీకాలు వేయించుకున్న 45 సంవత్సరాలు వయసు పైబడిన 160మందికి రెండో విడుత టీకాలు శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వేసినట్లు మండల వైద్యాధికారి ప్రణీష తెలిపారు.

ఎన్‌ఆర్‌ఐల సేవలు మరువలేనివి
తుర్కపల్లి: ఎన్‌ఆర్‌ఐల సేవలు మరువలేనివని వైస్‌ ఎంపీపీ మహదేవుని శ్రీనివాస్‌ అన్నారు. అమెరికాలోని గ్రేటర్‌ ఆట్లాం టా తెలంగాణ సోసైటీ టీమ్‌ సభ్యుల సహకారంతో శుక్ర వారం మండల కేంద్రంతోపాటు మాదాపురం, నాగాయపల్లి, మల్కా పురం, ధర్మారం, వాసాలమర్రి గ్రామాలు, బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడి గ్రామంలో కరోనా బాధితులు, పారిశుధ్యకార్మికులు, ఆశా వర్కర్లు, ఒంటరి మహిళలకు నిత్యా వసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో కో ఆప్షన్‌ స భ్యుడు రహమత్‌ షరీఫ్‌, సర్పంచ్‌లు పోగుల ఆంజనేయులు, యాపోషమణి పెంటయ్య, ఉప సర్పంచ్‌ భిక్షపతి, టీమ్‌ సభ్యు లు సుంకరి సుభాశ్‌, జగదీశ్‌, బొమ్మ దర్మేందర్‌, కట్టా వెంకటే శ్‌, బాబు, సుదర్శన్‌, వీరమల్లప్ప తదితరులు ఉన్నారు.

కరోనా పై కళాజాత
రాజాపేట: మండలంలోని రాజాపేట, రఘునాథపురం, చ ల్లూరు, కాల్వపల్లి బంసతాపురంతో పాటు నెమిల, పుట్టెగూ డెం, కొన్‌రెడ్డి చెర్వు, నర్సాపూరం గ్రామాల్లో శుక్రవారం జాగృ తి కళాబృందంతో కరోనాపై కళాజాత నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎస్సై శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

కరోనా బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ
ఆత్మకూరు(ఎం), జూన్‌ 4: మండలంలోని పల్లెర్లలో కరోనా బాధితుల కుటుంబాలకు శుక్రవారం హైదారాబాద్‌లోని ఉప్ప ల్‌ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉప్పల శ్వేతాశేఖర్‌గుప్తాల సహకారంతో నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామస్థు డు భాస్కర్‌, శేఖర్‌, అరవింద్‌, మధు, వంశీ పాల్గొన్నారు.

ఉపాధి కూలీలకు మాస్కులు పంపిణీ
రాజాపేట: మండల కేంద్రానికి చెందిన సీత జగదీశ్‌ జ్ఞాపకార్థం శుక్రవారం గొంగిడి ఫౌండేషన్‌ సభ్యులు ఉపాధి కూలీలకు మా స్కులు, బట్టర్‌ మిల్క్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు రేగు సిద్ధులు, నాయకులు గుర్రం నర్సింహులు, సీత ఉమేశ్‌, గుర్రం పాండు, చిగుళ్ల సిద్ధులు, ఐలయ్య, సత్యనారాయణ, రామచంద్రం తదితరులున్నారు.

‘దివీస్‌’ కృషి అభినందనీయం
చౌటుప్పల్‌: కొవిడ్‌ కట్టడికి దివీస్‌ పరిశ్రమ యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమని డీసీపీ నారాయణరెడ్డి తెలిపా రు. స్థానిక సీహెచ్‌సీలో దివీస్‌ సమకూర్చిన రూ.16 లక్షల 91 వేల విలువైన సెంట్రల్‌ ఆక్సిజన్‌ పైపులైన్‌, 30 బల్క్‌ అక్సిజన్‌ సిలండర్లను డీసీపీ శుక్రవారం ఆర్డీవో సూరజ్‌కుమార్‌కు అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల యాజమాన్యాలు కరోనా కట్టడికి తమవంతు సాయం చేయాల న్నారు. కార్యక్రమంలో ఏసీపీ సత్తయ్య, సీఐ శ్రీనివాస్‌, తహ సీల్దార్‌ గిరిధర్‌, పరిశ్రమ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సుధాకర్‌, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ డా. అలివేలు, మండ ల వైద్యాధికారి డా. శివప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో యశోద, కిశోర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

భోజన ప్యాకెట్లు అందజేత
భువనగిరి టౌన్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో పట్టణంలోని పేదలకు, యాచకులకు, బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయా ణికులకు 17వ వార్డు కౌన్సిలర్‌ స్వాతి, టీఆర్‌ఎస్‌ వార్డు కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌లు శుక్రవారం భోజన ప్యాకెట్లు అందజే శారు.కార్యక్రమంలో శ్రవణ్‌, సంకీర్త్‌,నరేశ్‌, శేఖర్‌ పాల్గొన్నారు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలి

ట్రెండింగ్‌

Advertisement