e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home యాదాద్రి చిన్నారులను చదివిస్తా

చిన్నారులను చదివిస్తా

చిన్నారులను చదివిస్తా
  • అశోక్‌ పెద్ద కుమార్తెను దత్తత తీసుకుంటా
  • ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
  • అనాథలైన ముగ్గురు చిన్నారులకు పరామర్శ
  • తక్షణసాయంగా రూ. 25వేల చెక్కు అందజేత

మోటకొండూర్‌, జూన్‌ 4: తల్లిదండ్రులను కోల్పోయి అనాథ లైన ముగ్గురు చిన్నారుల చదువు బాధ్యత తనదేనని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఐటీ మంత్రి కేటీ ఆర్‌ సహకారంతో చిన్నారులకు ప్రభుత్వం నుంచి పూర్తి భరో సా కల్పించి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శుక్రవారం మండలంలోని కదిరేణిగూడెంకు చెందిన గీత కార్మి కుడు నల్లమాస అశోక్‌ ఇటీవల మృతి చెందడంతో అనాథలైన ముగ్గురు చిన్నారులను స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించా రు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ సునీత మాట్లాడుతూ.. అ శోక్‌ కుటుంబ సభ్యులు అంగీకరిస్తే పెద్ద కూతురైన రేణును ద త్తత తీసుకొని రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదివించి పూర్తి బా ధ్యత తీసుకుంటామన్నారు. మరో ఇద్దరు చిన్నారులను కూడా రెసిడెన్షియల్‌ పాఠశాలలో చేర్పిస్తామన్నారు. సోషల్‌ మీడియా లో వీరి సమస్యను చూసిన మంత్రి కేటీఆర్‌ స్పందించి స్వ యంగా గ్రామ సర్పంచ్‌కు ఫోన్‌ చేసి చిన్నారుల వివరాలను అ డిగి తెలుసుకున్నారన్నారు.

పూర్తి వివరాలు చేరగానే మంత్రి కేటీఆర్‌ నుంచి సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. గతంలో చిన్నారుల తండ్రి అశోక్‌ ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి పడినప్పుడు దవాఖాన ఖర్చుల నిమిత్తం రూ.2లక్షల ఎల్‌వోసీని మంజూరు చేసినా అశోక్‌ మరణించడం బాధాక రమని అన్నారు. చిన్నారుల సంరక్షణ నిమిత్తం ప్రభుత్వం నుం చి ప్రతినెల స్పాన్సర్‌షిప్‌ కింద రేణు, సుప్రియలకు ఒక్కొక్కరికీ వచ్చే రూ. 2వేల మంజూరీ పత్రాన్ని అందజేశారు. అదేవిధం గా గ్రామానికి చెందిన జెట్ట మహేశ్వర్‌ చిన్నారులకు రూ. 20 వేల చెక్కును, నిత్యావసర సరుకులను అందజేశారు.

కార్యక్రమంలో ఎంపీపీ ఇందిర, జడ్పీటీసీ వెంకట్‌రెడ్డి, సర్పం చ్‌ పాండు, డీడబ్యూసీ చైర్మన్‌ జయశ్రీ, బాలల పరిరక్షణ అధి కారి సైదులు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పద్మ, టీఆర్‌ఎస్‌ మండ లాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ముత్తిరెడ్డిగూడెం సర్పంచ్‌ విజయ, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ రాంచంద్రయ్య, బురాన్‌ పాల్గొన్నారు.

సహాయనిధి చెక్కులు పంపిణీ
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎ మ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం మండలం లోని కదిరేణిగూడెంలో చందేపల్లి గ్రామానికి చెందిన సాయిరె డ్డి తిరుమల్‌రెడ్డికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద మంజూరైన రూ. 40 వేల చెక్కును లబ్ధిదారుడికి అందజేశారు. అదేవిధంగా ఆలే రు పట్టణంలో మాటూరుకు చెందిన బొలికొండ వెంకటేశ్‌కు మంజూరైన రూ.37,500 చెక్కు అందజేశారు

కరోనా బాధితులకు ప్రభుత్వం అండ
రామన్నపేట: కరోనా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరు మర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం కుంకు డుపాములలో కరోనాతో మరణించిన టీఆర్‌ ఎస్‌ నేత రామోజు వెంకటాచారి కుటుంబాన్ని ఆయన పరామర్శించి ఆర్థిక సాయం అందజే శారు. వారి పిల్లల చదువుల బాధ్యత తీసుకుం టా అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ యాది రెడ్డి, ఎంపీటీసీ పుష్ప పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చిన్నారులను చదివిస్తా

ట్రెండింగ్‌

Advertisement