e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home యాదాద్రి కల్తీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్‌

కల్తీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్‌

కల్తీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్‌

చౌటుప్పల్‌, జూన్‌1: రైతులకు కల్తీ విత్తనాలు, ఎరువుల ను విక్రయిస్తే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని సీఐ శ్రీనివా స్‌, ఏవో నాగరాజు హెచ్చరించారు. స్థానిక మన గ్రోమోర్‌ ఎరువుల దుఖాణాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపులో నిల్వ చేసిన పత్తి విత్తనాలను పరిశీలిం చారు. షాపునకు ఎరువులు సరఫరా చేస్తున్న కంపెనీల ప్రి న్సిపల్‌ సర్టిఫికెట్లను పరిశీలించారు. వారి వెంట ఎస్సై నవీన్‌బాబు ఉన్నారు.

కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు
రామన్నపేట: కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని అంతర్‌ జిల్లా తనిఖీ బృందం సభ్యులు వెంకటేశ్వర్లు, సు జాత తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎ రువుల దుకాణాలను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వారి వెంట వ్యవసాయ అధికారి యాదగిరిరావు ఉన్నారు.

విత్తన కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలి
బొమ్మలరామారం: కల్తీ విత్తనాలు, హాట్‌ కాటన్‌ పత్తి వి త్తనాలు, కలుపు నివారణ మందుల కొనుగోళ్లలో రైతులు అప్రమత్తంగా ఉండాలని భువనగిరి రూరల్‌ సీఐ జాన య్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు, చీకటిమామిడి, మర్యాల, సోలిపేట గ్రామాల్లోని సీడ్స్‌, వి త్తనాల ఫర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ విత్తనాలు రైతుల కు అమ్మాలని చూస్తే సహించేది లేదన్నారు.ఎరువుల కొనుగోలులో అనుమానం వస్తే వెంటనే వ్యవసాయశాఖ అధికారులకు, పోలీసులకు సమా చారం ఇవ్వాలన్నారు. అనంతరం ఆయా దుకాణాల్లో రి కార్డులు పరిశీలించి, స్టాక్‌ను తనిఖీ చేశారు. ఆయన వెం ట మండల వ్యవసాయాధికారి రాజేశ్‌, ఎస్‌ఐ వెంకన్న, సిబ్బంది తదితరులు ఉన్నారు.

డీలర్ల వద్దే విత్తనాలు తీసుకోవాలి
తుర్కపల్లి: నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు ఉంటాయని ఏవో దుర్గేశ్వరి అన్నారు. మండల కేంద్రం లోని విత్తన దుకాణాల్లో మంగళవారం ఆమె ఆకస్మిక తని ఖీ నిర్వహించి విత్తన లైసెన్స్‌లతో పాటు రికార్డులు పరిశీ లించారు. రైతులు లైసెన్స్‌ ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు తీ సుకోవాలని సూచించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కల్తీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్‌

ట్రెండింగ్‌

Advertisement