ఆలేరురూరల్, మే1: ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి అన్ని సేవలు ‘మీ సేవ’లో అందుబాటులో ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కోవలోకి పోలీస్‌శాఖ కూడా చేరడం విశే షం. ఈశాఖకు సంబంధించిన పలు సేవలను మీ సే వలో దరఖాస్తు చేసుకొని పొందే వీలు కల్పించారు.
ఆన్లైన్లో అనుమతులు
సభలు, సమావేశాలు వంటి వాటికి సంబంధించి ముందస్తుగా పోలీస్ బందోబస్తు అవసర మనుకుం టే మీ సేవ కేంద్రంలో సంబంధిత రుసుమును చెల్లిం చి దరఖాస్తు చేసుకోవాలి. పోలీసులు అవసరాన్ని గుర్తించి వారంలోగా బందోబస్తు కేటాయించేది, లేని ది తెలియజేస్తారు. ప్రైవేట్ శుభకార్యాలకు మైక్, బ్యాండ్‌మేళం నిర్వహించుకునే వాటికి మీ సేవ ద్వా రా పోలీసుల అనుమతి పొందవచ్చు. దీంతో మనకు స్టేషన్ల చుట్టూ తిరిగే ఇబ్బందులు ఉండవు.