గురువారం 04 మార్చి 2021
Yadadri - Sep 17, 2020 , 01:48:54

మహిళా రైతులు ఆర్థిక ప్రగతి సాధించాలి

మహిళా రైతులు ఆర్థిక ప్రగతి సాధించాలి

జిల్లా వ్యవసాయాధికారి అనురాధ 

బొమ్మలరామారం : వ్యవసాయరంగంలో మహిళా రైతులు ఆర్థిక ప్రగతి సాధించాలని జిల్లా వ్యవసాయాధికారిని అనురాధ అన్నారు.  బుధవారం తిమ్మాపూర్‌లోని లక్ష్మీ గార్డెన్‌ ఫంక్షన్‌ హల్‌ల్లో గ్రామీణా మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళా అభ్యుదయ ధీశాలి సొసైటీ తృతీయ వార్షికోత్సవ సభ నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. ధీశాలి సంస్థ మహిళా రైతులను గుర్తించి వారికి సాంకేతిక విజ్ఞానం అందించి అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. మహిళలకు ఆర్థిక వనరులు సమకూర్చడంతో పాటు కూరగాయల అమ్మకం కోసం మినీ మార్కెట్‌ యార్డులు  స్థాపనకు చేయూతనందిస్తామన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించాలన్నారు. మహిళల ఆర్థికా సాధికారతకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు.   కార్యక్రమంలో గ్రామీణా మహిళా మండలి అధ్యక్షురాలు విజయలక్ష్మి, పిలుపు సంస్థ డైరెక్టర్‌ నిమ్మయ్య, ధీశాలి చైర్‌పర్సన్‌లు పల్లె మంజుల, గోలిపెల్లి సుజాత, మాస్‌ సంస్థ డైరెక్టర్లు కిషోర్‌కుమార్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo