వార్డుకో అధికారి వస్తున్నారు

మున్సిపాలిటీల్లో నూతన ఒరవడికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం
వార్డుకో అధికారి నియామకం
జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 104 వార్డు అధికారుల పోస్టుల భర్తీకి అవకాశం
ప్రభుత్వ నిర్ణయంతో ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం
వేగవంతం కానున్న అభివృద్ధి పనులు
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:
స్వచ్ఛ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దడంతోపాటు.. ప్రతి కాలనీని హరిత కాలనీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పారిశుధ్యం, హరితహారం వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను, పుర సేవలను విస్తృతం చేసింది. ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా అమలు చేసేందుకు పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది నియామకాన్ని చేపట్టేందుకు పురపాలిక శాఖ కసరత్తును మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ప్రతి వార్డుకు ఒక పురపాలక ఉద్యోగిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతనంగా చేపట్టబోయే పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్యాబినెట్ సైతం ఆమోదం తెలిపింది. ఈ తరహాలో నియామకం చేపట్టడం దేశంలోనే ప్రప్రథమని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో 104 మంది అధికారుల నియామకం
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 104 వార్డులు ఉన్నాయి. భువనగిరి మున్సిపాలిటీలో అత్యధికంగా 35 వార్డులు ఉండగా.. యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు మున్సిపాలిటీల్లో 12 వార్డులు, భూదాన్ పోచంపల్లి 13 వార్డులు, చౌటుప్పల్ 20 వార్డులు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి వార్డుకు ఒక అధికారిని నియమించనుండడంతో జిల్లాలో 104 మంది అధికారులను ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం మున్సిపాలిటీలను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. అభివృద్ధి పనులపై పర్యవేక్షణ కొరవడడంతోపాటు.. చిన్న చిన్న సమస్యలకు సైతం ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్తగా వార్డు అధికారులను నియమించడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వార్డు అధికారులు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా పనిచేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడంతో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ప్రజలకు చేరువ చేసే అవకాశం ఉంది. వార్డు అధికారులతో పాటు ఇద్దరు చీఫ్ ఇంజినీర్లను.. వీరికి సహాయంగా ఇద్దరు ఎస్ఈలను నియమించాలని ప్రభుత్వం సంకల్పిస్తుండడంతో అభివృద్ధి పనులు వేగం పుంజుకోవడంతోపాటు పనుల్లో పారదర్శకత సైతం పెరగనుంది.
తాజావార్తలు
- పుంజుకున్న కార్లు+ట్రాక్టర్ల సేల్స్.. బట్ త్రీ వీలర్స్ 50 శాతం డౌన్!
- ‘జాతి రత్నాలు’ బిజినెస్ అదుర్స్.. అంచనాలు పెంచేస్తున్న సినిమా
- పీఎంఏవై-యూ కింద కోటి 11 లక్షల ఇళ్లు మంజూరు
- ఆశాజనకంగా ఆటో సేల్స్ : ఫిబ్రవరిలో 10.59 శాతం పెరిగిన కార్ల విక్రయాలు
- పుదుచ్చేరి ఎన్నికలు.. ఎన్డీఏ కూటమిలో ఎవరెవరికి ఎన్ని సీట్లంటే.!
- సచిన్ వాజేను అరెస్టు చేయండి.. అసెంబ్లీలో ఫడ్నవీస్ డిమాండ్
- ఎమ్మెల్యే అభ్యర్థిగా అసోం సీఎం నామినేషన్ దాఖలు
- ఆదా చేయండి.. సీదా వెళ్లండి
- రూ.5.85 లక్షల కోట్ల రుణాల రద్దు!
- టీఎస్ ఈసెట్-2021 పరీక్ష షెడ్యూల్ విడుదల