ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 22, 2020 , 01:14:44

పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తాచాటాలి

పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తాచాటాలి

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి 

భూదాన్‌పోచంపల్లి: త్వరలో జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం పోచంపల్లి పట్టణంలోని బాలాజీ ఫంక్షన్‌ హాల్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశం టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. పార్టీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇచ్చినా వారిని గెలిపించే బాధ్యత అందరిపై ఉందన్నారు. 2017 వరకు డిగ్రీ పూర్తిచేసిన   పట్టభద్రులను  నూతన ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. కరోనా విషయంలో అధైర్యపడాల్సిన అవసరం లేదని, హోంఐసొలేషన్‌లో  చికిత్స పొందుతున్న వారికి పౌష్టికాహారం కిట్లు అందజేస్తున్నామన్నారు. ఎయిమ్స్‌తోపాటు భువనగిరి ఏరియా దవాఖానాలో  కూడా ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ  ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ  వెంకటేశం, జడ్పీటీసీ పుష్పలత, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మి, వైస్‌ చైర్మన్‌   లింగస్వామి, సింగిల్‌విండో చైర్మన్లు  లింగంయాదవ్‌,  భూపాల్‌రెడ్డి, భువనగిరి మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు  భిక్షపతి, మాధవరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు   రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు మాధవి, మాజీ ఎంపీపీ  సరస్వతి, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ శేఖర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకుడు రంగ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo