సోమవారం 01 మార్చి 2021
Yadadri - Sep 14, 2020 , 00:51:36

రోజురోజుకూ పెరుగుతున్న వైరస్‌

రోజురోజుకూ పెరుగుతున్న వైరస్‌

పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ 

రాజాపేట : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో ఆదివారం 13 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి శివవర్మ తెలిపారు. పాముకుంట, రేణికుంట, కాల్వపల్లిలో ఒక్కొక్కరికీ కరోనా సోకడంతో వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని నర్సాపురం గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా సోకడంతో గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

 ఆత్మకూరు(ఎం)లో ఒకరికి..

ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 22 మం దికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి ప్రణీష తెలిపారు.

బొమ్మలరామారంలో ఇద్దరికి..

బొమ్మలరామారం : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరుగురికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి శ్రవణ్‌కుమార్‌ తెలిపారు.

 బీబీనగర్‌ ఐదుగురికి..

బీబీనగర్‌ : మండలంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 74 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చిందని తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు.

మోత్కూరులో ఆరుగురికి..

మోత్కూరు : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 36 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి ఆకవరం చైతన్యకుమార్‌ తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారిని హోం క్వారంటైన్‌ చేసి ఐసొలేషన్‌ కిట్లు అందజేసినట్లు తెలిపారు.

తాళ్లసింగారంలో కరోనా పరీక్షలు..

చౌటుప్పల్‌ : మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారంలో గ్రామస్తులకు మండల వైద్యాధికారి శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. గ్రామంలోని అనుమానితులందిరికీ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు లింగస్వామి, రాజ్యలక్ష్మీస్వామిగౌడ్‌, నాయకులు మల్లేశ్‌, నవీన్‌రెడ్డి, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo