కడుపునిండా.. ఆనందం

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు అలుగు పోస్తున్న చెరువులు, కుంటలు
సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, ప్రభుత్వవిప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి చిత్రపటాలకు క్షీర, జలాభిషేకం చేసిన రైతన్నలు
ఆలేరు : ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కృషితోనే చొల్లేరు, మర్రిగూడెం, మహబూబ్‌పేట గ్రామాల్లోని దేవతల చెరువు, పటేల్ చెరువులు నిండి అలుగు పోస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని జడ్పీటీసీ తోటకూరి అనురాధ స్పష్టం చేశారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు యాదగిరిగుట్ట మండలంలోని మర్రిగూడెంలో దేవతల చెరువు నిండి అలుగుపోస్తుండటంతో శనివారం సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ చిత్రపటానికి రైతులతో కలిసి క్షీరా, జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్ ప్రత్యేక చొరవ తీసుకుని వంగపల్లిలోని వాగు నుంచి కండ్లకుంట వరద కాల్వను పునరుద్ధరించారని తెలిపారు. అక్కడి భూములు కోల్పోయిన రైతులకు ఆర్థికసాయం అందజేసి కాల్వ పనులు చేపట్టేందుకు కృషి చేశారన్నారు. కాల్వ నిర్మాణానికి సహకరించిన సన్‌సిటీ గ్రూప్ చైర్మన్ జడపల్లి నారాయణగౌడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చొల్లేరు సర్పంచ్ తోటకూరి బీరయ్య, ఎంపీటీసీ కొక్కలకొండ అరుణ, మహబూబ్‌పేట సర్పంచ్ ఆరె స్వరూపామల్లేశ్గౌడ్, మర్రిగూడెం సర్పంచ్ యాదయ్య, పాల సంఘం చైర్మన్ కౌకుంట్ల రాంచంద్రారెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్ కొక్కలకొండ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామారంలో..
బొమ్మలరామారం : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతోపాటు, గోదావరి జలాలతో మండలంలోని తిమ్మాపూర్‌లో ఉన్న తిమ్మప్ప చెరువు నిండి అలుగుపోస్తుంది. దీంతో గ్రామస్తులు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తూ శనివారం చెరువు అలుగు వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బాల్‌నర్సయ్య, ఉప సర్పంచ్ దండు యాదగిరి, ఎంపీటీసీ శ్రీహరినాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ గుండ్లపల్లి వెంకటేశ్‌గౌడ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పాశం బాల్‌నర్సింహ, మత్స్యకారులు బాలకృష్ణ, కృష్ణమూర్తి, నాయిని మల్లయ్య, మంద కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- దేశవ్యాప్తంగా 10వేల కంపెనీల మూత.. ఎందుకంటే?!
- చికిత్స పొందుతూ యాసిడ్ దాడి బాధితురాలు మృతి
- మనువాడే వ్యక్తితో స్టైలిష్ ఫొటో దిగిన మెహరీన్
- దేశంలో కొత్తగా 15,388 కొవిడ్ కేసులు
- రైతు ఆందోళనలపై బ్రిటన్ ఎంపీల చర్చ.. ఖండించిన భారత్
- అమ్మమ్మ మాదిరిగా హావభావాలు పలికించిన సితార- వీడియో
- అభివృద్ధిని చూసి ఓటెయ్యండి : ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి
- మహిళను ముక్కముక్కలుగా నరికేశారు..
- తొమ్మిదికి పెరిగిన మృతులు.. ప్రధాని సంతాపం
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్