కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు

ఆలేరు: స్వాతంత్య్ర సమరయోధుడు, తొలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ భావితరాలను స్ఫూర్తిదాయకమని మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్ పేర్కొన్నారు. లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆదివారం యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కాటంరాజు, కౌన్సిలర్లు ఆవుల మమతాసాయి, సురేందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాటబత్తిని ఆంజనేయులు, కోఆప్షన్ సభ్యులు గోర్ల పద్మ, పేరబోయిన పెంటయ్య, నాయకులు పాల్గొన్నారు.
ఆలేరు టౌన్లో..
ఆలేరు టౌన్ : ఆలేరు పట్టణంలో కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతిని కాటన్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చింతకింది మురళి, రేగోటి వెంకటేశం, సత్యనారాయణ, మల్లేశం, పద్మ, అశోక్, రామానుజన్, చింతకింది మార్కండేయ, మసునూరి యాదగిరి, యాదగిరి, నాగయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు. కేజేఆర్ ఫంక్షన్హాల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పరమేశ్వర్, కౌన్సిలర్ రాములు తదితరులు పాల్గొన్నారు.
రాజాపేటలో..
రాజాపేట : మండలంలోని రాజాపేట, రఘునాథపురం గ్రామాల్లో కొండా లక్షణ్బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయమ్మ, పద్మశాలీ సంఘం జిల్లా నాయకుడు కటకం జనార్దన్, గుర్రం సిద్ధిరాములు, చుంచు నారాయణ, నరేందర్, శ్రీరాములు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం)లో...
ఆత్మకూరు(ఎం): కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతిని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ చిప్పలపల్లి యాదగిరి, పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో పద్మశాలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుల్తాన్ పురుషోత్తం కొండా లక్ష్మణ్‌బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వీఆర్వోలు కనకయ్య, రంజాన్, పద్మశాలీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
బొమ్మలరామారంలో...
బొమ్మలరామారం : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పద్మాసుందరి, ఎస్వో శ్రీనివాస్, శంకర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
గుండాలలో...
గుండాల : కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో చైర్మన్ దుడుక ఉప్పలయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీపతి రంగయ్య, దుడుక సత్యం, దోర్నం గోపాల్, బొల్లం యాదగిరి, సత్తయ్య పాల్గొన్నారు.
తాజావార్తలు
- చౌకధరకే టెస్లా విద్యుత్ కారు!
- ఆ టైంలో అందరూ భయపెట్టారు: అమలా పాల్
- ఖాదర్‌బాషా దర్గాను సందర్శించిన హోంమంత్రి
- హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
- యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
- ఆస్తి పన్ను పెంపు దారుణం : చంద్రబాబు
- స్మృతి మందాన@6
- ‘నాంది’ 11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
- వామన్‌రావు దంపతుల హత్య బాధ కలిగించింది : కేటీఆర్
- 18 ఏళ్లకే ముద్దు పెట్టేశా.. ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్