మంగళవారం 09 మార్చి 2021
Yadadri - Sep 24, 2020 , 01:32:08

ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించాలి

ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

భువనగిరి కలెక్టరేట్‌ : గ్రామ, పట్టణస్థాయిలో ఆమో దం లేని లే అవుట్ల్లు, ప్లాట్లను గుర్తించి వందశాతం ఎల్‌ఆర్‌ఎస్‌ సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని  చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌  కలెక్టర్లకు సూచించారు. బుధవారం ఆయన రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ రెగ్యులరైజ్‌ చేసుకునేలా క్షేత్రస్థాయిలో సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ స్థాయిలో మున్సిపాలిటీకి ఒక ప్రత్యేకాధికారి నియామకం చేయాలన్నారు. సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌)  రోజూ రైస్‌ మిల్లుల నుంచి ఎఫ్‌సీఐకి పంపిస్తున్న ధాన్యం, బ్యాలె న్స్‌ వివరాలు తెలియజేయాలన్నారు. సీఎంఆర్‌ లక్ష్యాలను వచ్చే ఏడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో నిర్మించే పల్లెప్రకృతి వనాలు, రైతు వేదికలు, నర్సరీలు, అర్బన్‌ టీ పార్కులు, స్ట్రీట్‌ వెండర్స్‌ రుణాలకు సంబంధించి ఆయన సమీక్ష చేసి కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.VIDEOS

logo