ప్రాపర్టీ వివరాలు పొందుపర్చాలి

భువనగిరి కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో వ్యవసాయ, వ్యవసాయేతర ప్రాపర్టీని యజమానులు తప్పనిసరిగా తమ ఆధార్, టెలిఫోన్ నంబర్‌తో రికార్డింగ్ చేసుకునేలా ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులు సర్వే చేయాలని కలెక్టర్ అనితారామచంద్రన్ సూచించారు. సోమవారం డీపీవో, ఎంపీడీవో, ఎంపీవోలతో గూగుల్‌మీట్ ద్వారా మాట్లాడారు. ధరణి వెబ్సైట్లో గ్రామ పంచాయతీ ప్రాపర్టీ వివరాలు పూర్తిస్థాయిలో పొందుపరించేందుకు ముందస్తుగా అన్ని గ్రామ పంచాయతీల్లో రివిజన్ రిజిష్ట్రర్ ఏర్పాటు చేయాలన్నారు. దీంతో పాటు నమోదు కాని ప్రాపర్టీ వివరాలకు సప్లిమెంటరీ రిజిష్ట్రర్‌లో పొందుపరిచి వారం రోజుల్లో రికార్డింగ్ పూర్తిచేయాలన్నారు. చిన్న గ్రామ పంచాయతీల్లో మూడు రోజుల్లోపు పూర్తిచేయాలని సూచించారు. రికార్డింగ్ పూర్తైన గ్రామ పంచాయతీ వివరాలను గ్రామ పంచాయతీల వారీగా ప్రచురించి అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. అక్టోబర్ 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ధరణి వెబ్సైట్లో నమోదుకు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కీమ్యానాయక్, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, ఎంపీడీవో, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ప్రజావాణి పిటిషన్లను
త్వరితగతిన పరిష్కరించాలి..
ప్రజావాణికి ప్రజల నుంచి వచ్చిన పిటిషన్లను సంబంధిత శాఖ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అనితారామచంద్రన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా మొత్తం 86 పిటిషన్లను స్వీకరించారు. ఇందులో ఫోన్‌ఇన్ ద్వారా 26 పిటిషన్లను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను శాఖల వారీగా సమస్యలను పరిష్కరించి పిటిషనర్లకు తెలియజేయాలన్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కీమ్యానాయక్, ప్రజావాణి కో-ఆర్డినేటర్ జ్యోతి పాల్గొన్నారు.
తాజావార్తలు
- లీటర్ పెట్రోల్ ధర రూ.100.. ఇక కామనే.. మోత మోగుడు ఖాయం
- మ్యాన్‌హోల్‌లో చిక్కుకుని నలుగురు మృతి
- ఉత్తమ రైతు మల్లికార్జున్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్‌షా
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్‌లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ