బుధవారం 24 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 27, 2020 , 01:45:05

యాదాద్రీశుడికి శాస్ర్తోక్తంగా నిత్యపూజలు

 యాదాద్రీశుడికి శాస్ర్తోక్తంగా నిత్యపూజలు

ఆలేరు : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. బాలాలయంలో శనివారం స్వామివారికి అర్చకులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. వేకువజామునే స్వామివారికి సుప్రభాతం నిర్వహించిన అర్చకులు అర్చనలు, అభిషేకం, పుష్పార్చన చేపట్టారు. శ్రీసుదర్శన నారసింహహోమం జరిపారు. ఆగమశాస్ర్తోక్తంగా స్వామి, అమ్మవార్లు నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మంటపంలోనే ఊరేగించారు. సుమారు గంటన్నర పాటు కల్యాణ తంతు కొనసాగింది. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేపట్టారు. రాత్రి వేళ స్వామి, అమ్మవార్లకు మహానివేదన జరిపించి, అనంతరం శయనోత్సవం జరిపించారు. 

ఖజానాకు రూ. 2,79,222 ఆదాయం

యాదాద్రి ఖజానాకు రూ.2,79,222 సమకూరినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రచారశాఖ ద్వారా రూ. 2,200, ప్రసాద విక్రయాలతో రూ. 2,31,230, చెక్‌పోస్టు ద్వారా రూ.1,100,  వాహనపూజల ద్వారా రూ. 7,900, అన్నదాన విరాళంతో రూ. 1,516, మినీ బస్సులతో రూ.1,670,శాశ్వత పూజల ద్వారా రూ.10,116, కొబ్బరికాయలతో రూ. 23,490లతో కలిపి మొత్తం రూ. 2,79,222 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. VIDEOS

logo