బుధవారం 24 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 29, 2020 , 00:48:35

నింగీ నేల మురిసేలా.. కదిలింది.. కర్షక రథం

నింగీ నేల మురిసేలా.. కదిలింది.. కర్షక రథం

భువనగిరి నియోజకవర్గంలో అన్నదాతల సంబురాలు

నూతన రెవెన్యూ చట్టానికి ఘన స్వాగతం

భువనగిరి, బీబీనగర్‌, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ మండలాల్లో ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు

286 ట్రాక్టర్లతో ఊరేగింపు నిర్వహించిన రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు

జయహో కేసీఆర్‌ అంటూ నినదించిన ప్రజానీకం

స్వయంగా ట్రాక్టర్‌ నడిపి ఉత్సాహపర్చిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

నూతన చట్టంతో పైసా ఖర్చు లేకుండానే రైతు చేతికి పాసు బుక్కు : ఎమ్మెల్యే 

కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఏండ్లనాటి కష్టాలను దూరం చేసేందుకు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ముక్తకంఠంతో స్వాగతిస్తున్నారు. ట్రాక్టర్లతో ఊరేగింపులు నిర్వహించి సంబురాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతగా సోమవారం భువనగిరిలో భారీ ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని భువనగిరి, బీబీనగర్‌, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ మండలాల నుంచి ట్రాక్టర్లతో రైతులు తరలిరాగా, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.   నృత్యాలు, డప్పుచప్పుళ్లు, పటాకుల శబ్దాల నడుమ భువనగిరి పట్టణ ప్రధాన రహదారిపై సాగిన ర్యాలీ కోలాహలంగా సాగింది. రైతు బాంధవుడికి జేజేలు పలుకుతూ అడుగడుగునా కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఆయా మండలాల్లోని 127 గ్రామాల నుంచి రైతులు, వివిధ వర్గాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. భువనగిరి బైపాస్‌ నుంచి ఆరంభమైన ర్యాలీ రాయగిరి మీదుగా భువనగిరి పట్టణంలోకి ప్రవేశించి ఆర్టీసీ బస్టాండ్‌, వినాయక చౌరస్తాల మీదుగా అట్టహాసంగా సాగింది.

- యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

పైసా ఖర్చు లేకుండా పాస్‌ బుక్‌ : ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారని, ఇకపై పైసా ఖర్చు లేకుండానే రైతుల చేతికి పాస్‌ బుక్కు అందనున్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. నూతన రెవెన్యూ చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతా భావంగా సోమవారం భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి, వలిగొండ, బీబీనగర్‌, భూదాన్‌పోచంపల్లి మండలాల రైతులు నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీని భువనగిరి పట్టణంలోని జయలక్ష్మి గార్డెన్‌ వద్ద ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. భువనగిరి బైపాస్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ రాయగిరి, భువనగిరి పాతబస్టాండ్‌, వినాయక చౌరస్తా మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి సంతోషమే మళ్లీ నూతన రెవెన్యూ చట్టం సందర్భంగా రైతుల్లో కన్పిస్తోందన్నారు. రైతును రాజు చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలకు ఎలాంటి ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా భూరికార్డులు నిర్వహించడానికి ఈ చట్టం దోహదపడుతుందన్నారు. నూతన చట్టాన్ని అన్నివర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని, రైతులు సంతోషంగా సంబురాలు జరుపుకుంటున్నారన్నారు. త్వరలోనే గోదావరి జలాలు భువనగిరి నియోజకవర్గానికి రానుండటంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కానుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇప్పటికే రైతుబీమా, రైతుబంధు, ఉచిత నిరంతర విద్యుత్‌ను అందజేస్తోందన్నారు. ట్రాక్టర్‌పై ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్‌ క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జడల అమరేందర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొలను లావణ్యాదేవేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ నోముల పరమేశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గోమారి సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నక్కల చిరంజీవి యాదవ్‌, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ సుబ్బూరు బీరు మల్లయ్య, మండల అధ్యక్షుడు జనగాం పాండు, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ అబ్బగాని వెంకట్‌గౌడ్‌, రైతు సమన్వయ సమితి భువనగిరి మండల కోఆర్డినేటర్‌ కంచి మల్లయ్య, కౌన్సిలర్లు ఏవీ కిరణ్‌కుమార్‌, పంగరెక్క స్వామి, దిడ్డికాడి భగత్‌, వెంకట్‌నర్సింహనాయక్‌, తుమ్మల అనురాధాపాండు, అందె శంకర్‌, కోఆప్షన్‌ సభ్యుడు రాచమల్ల రమేశ్‌, నాయకులు చిందం మల్లిఖార్జున్‌, ఎడ్ల రాజిరెడ్డి, అతికం లక్ష్మీనారాయణ, సింగిరెడ్డి నర్సిరెడ్డి, కంచనపల్లి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

భారీగా తరలిన ట్రాక్టర్ల ర్యాలీ

భూదాన్‌పోచంపల్లి : భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీకి భూదాన్‌పోచంపల్లి నుంచి సుమారు 90 ట్రాక్టర్లతోపాటు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. పోచంపల్లిలో ప్రారంభమైన ర్యాలీని ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్‌, నాయకులు పాటి సుధాకర్‌రెడ్డి, కోట మల్లారెడ్డి, కందాడి భూపాల్‌రెడ్డి, రావుల శేఖర్‌రెడ్డి, గోరంటి శ్రీనివాస్‌రెడ్డి, సామ రవీందర్‌రెడ్డి, బత్తుల శ్రీశైలం, పర్నె మల్లారెడ్డి, పగిళ్ల రామ్‌రెడ్డి, నోమలు మాధవరెడ్డి, ఐతరాజు భిక్షపతి, రంగ విశ్వనాథం, సార సరస్వతీబాలయ్యగౌడ్‌, సీత వెంకటేశం, బాత్క లింగస్వామి, గుండు మధు, కర్నాటి రవీందర్‌, కుడికాల బలరామ్‌, పెద్దల చక్రపాణి, మల్లారెడ్డి, జంగారెడ్డి, బాలచంద్రంగౌడ్‌, ఆర్ల వెంకటేశం పాల్గొన్నారు. 

భువనగిరి దద్దరిల్లేలా... 

భువనగిరి అర్బన్‌: నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్‌, భువనగిరి, వలిగొండ, భూదాన్‌పోచంపల్లి మండలాల్లోని గ్రామాల నుంచి రైతులు సోమవారం ట్రాక్టర్లతో భువనగిరి పట్టణంలోని జయలక్ష్మి గార్డెన్‌కు చేరుకున్నారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ట్రాక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ భువనగిరి నల్లగొండ చౌరస్తా నుంచి బైపాస్‌ రోడ్డు మార్గంలో రాయగిరి, రైల్వేస్టేషన్‌, పాతబస్టాండ్‌ మీదుగా పట్టణంలోని వినాయక చౌరస్తా నుంచి హైదరాబాద్‌ చౌరస్తా మీదుగా నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి నడిపించారు. ట్రాక్టర్‌పై ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి క్షీరాభిషేకం చేశారు. 

రెవెన్యూ చట్టానికి మద్దతుగా..

బీబీనగర్‌: రెవెన్యూ చట్టానికి మద్దతుగా మండల కేంద్రంలోని పెద్దచెరువు వద్ద నుంచి భువనగిరికి రైతులతో కలిసి భారీ ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్‌, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ బొక్క జైపాల్‌రెడ్డి, జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ కొలను లావణ్యాదేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాచమళ్ల శ్రీనివాసులు ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్‌తోపాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

తరలిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు..

భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టానికి మద్దతుగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ట్రాక్టర్‌ ర్యాలీకి మండలంలోని అన్ని గ్రామాల నుంచి సుమారు 100 ట్రాక్టర్లలో టీఆర్‌ఎస్‌ నాయకులు తరలివెళ్లారు. ఈసందర్భంగా జై తెలంగాణ, జై కేసీఆర్‌, జై పైళ్ల శేఖర్‌రెడ్డి అంటూ నినాదాలు చేశారు. గ్రామాలు పూర్తిగా గులాబీమయంగా మారాయి. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, పీఏసీఎస్‌ చైర్మన్‌ నోముల పరమేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ కంచి మల్లయ్య, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్‌గౌడ్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పాలన బాగున్నది...

బీబీనగర్‌: సీఎం కేసీఆర్‌ సారు పాలన బాగున్నది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలు గొప్పవి. ఎన్నో ఏండ్ల నాటి నుంచి తీరని భూ సమస్యలు నూతన రెవెన్యూ చట్టంతో పరిష్కారవుతాయని ఆశిస్తున్నా. నా వంతు మద్దతు తెలిపేందుకే ఈ ట్రాక్టర్‌ ర్యాలీలో పాల్గొన్నా.

- వెంకటేశ్‌, చిన్నరావులపల్లి, బీబీనగర్‌ మండలం

భూములు కబ్జా కావు

నూతన రెవెన్యూ చట్టంలో భూములు ఆన్‌లైన్‌ కావడంతో భూములు కబ్జా కావు. నూతన  చట్టంతో రెవెన్యూ వ్యవస్థ ఆన్‌లైన్‌ కావడంతో  పనులు త్వరగా జరుగుతాయి. చట్టాన్ని ప్రణాళిక ప్రకారం తీసుకురావడంతో రైతుల కష్టాలు కన్పించవు. భూమి చేర్పులు, మార్పులు వీఆర్‌వో వ్యవస్థతోటే జరిగేది. ఇలా జరుగకుండా ఉండేందుకే వీఆర్‌వో వ్యవస్థ రద్దు చేసింది. దీంతో రైతులు సంబురాలు చేసుకుంటున్నారు.

- జడల అమరేందర్‌గౌడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ 

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

భువనగిరి అర్బన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు బాంధవుడు. రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి ధ్యేయం. అందుకే రైతు కోసం రైతుబంధు, రైతు బీమా, నిరంతర ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తు న్నారు. రైతు భూ సమస్యలను తీర్చడం కోస మే నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిండు. భూ సమస్యలు తీరాయని రైతులు సంబురాలు చేసుకుంటున్నారు.  

-కొలుపుల అమరేందర్‌, రైతుసమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు

రైతుల ఇబ్బందులు తొలగుతాయి

భువనగిరి అర్బన్‌: నూతన రెవెన్యూ చట్టంతో రైతుల ఇబ్బందులు తొలగుతాయి. గతంలో భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత రోజుల తరబడి మ్యుటేషన్‌ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేది. ఆన్‌లైన్‌ కావడంతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వెంటనే మ్యుటేషన్‌, తర్వాత పాస్‌బుక్‌ రైతుకు చేరుతుంది. ఈ చట్టంతో రైతు కష్టాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. - గోమారి సుధాకర్‌రెడ్డి, 

రైతు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు, భువనగిరి

రైతుకు ఎంతో మేలు చేసేలా ఉంది

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టం రైతులకు ఎంతో మేలు చేసేలా ఉన్నది. అందుకే సీఎంతోపాటు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ ట్రాక్టర్‌ ర్యాలీలో వెళుతున్నాం. రైతులు ఎంతో ఆనందపడుతున్నారు. ప్రభు త్వం కూడా రైతుల కోసం ఎంతో చేస్తున్నది. రైతు బీమా, రైతుబంధుతోపాటు ఉచిత కరెంట్‌ అందిస్తున్నాడు. సీఎం కేసీఆర్‌ సారు రుణం మర్చిపోలేము. రైతులంతా ఆనందించడమే లక్ష్యం గా పనిచేస్తుండు. ఆయనే ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలి.

- పాటి బుచ్చిరెడ్డి, రైతు, జూలూరు, భూదాన్‌పోచంపల్లి మండలం

రైతులకు వరం 

రాష్ట్రంలో అనాధిగా కొనసాగుతున్న రెవెన్యూ విధానాలతో రైతులు దోపిడీకి గురవుతున్నారని గుర్తించిన సీఎం కేసీఆర్‌ ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్‌ తెచ్చిన రెవెన్యూ చట్టం రైతులకు వరంగా మారనున్నది. గతంలో ఏ పాలకుడికి కూడా వీటిపైన సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రైతు సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనటువంటి చట్టాన్ని సీఎం కేసీఆర్‌ తీసుకురావడం శుభపరిణామం.

- ఎరుకల సుధాకర్‌గౌడ్‌, ఎంపీపీ, బీబీనగర్‌


వలిగొండ: రైతన్నల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతుగా టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. జయహో కేసీఆర్‌ అంటూ నినాదాలు చేస్తూ అన్నదాతలు మండల కేంద్రంలో 80 ట్రాక్టర్లకు సీఎం కేసీఆర్‌ చిత్రపటాలతో కూడిన గులాబీ జెండాలను అలంకరించి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో వలిగొండ మండలంలోని 35 గ్రామాల నుంచి 80 ట్రాక్టర్లతో రైతులు ర్యాలీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పైళ్ల రాజవర్ధన్‌రెడ్డి, వలిగొండ ఏఎంసీ చైర్‌పర్సన్‌ కునపూరి కవిత, మదర్‌ డెయిరీ డైరెక్టర్‌ గూడూరు శ్రీధర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు డేగల పాండరి, టీఆర్‌ఎస్‌ వలిగొండ పట్టణ అధ్యక్షుడు అయిటిపాముల రవీంద్ర, యూత్‌ అధ్యక్షుడు ఎమ్మె లింగస్వామి, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు శాంతికుమార్‌, నాయకులు శివయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.


VIDEOS

logo