భువనగిరి: జిల్లాలోని యాదగిరిగుట్టలో రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి శివారులో ఓ బైకును కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు రామాజీపేటకు చెందిన ఐలయ్య (75)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.