ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 27, 2020 , 01:45:08

ఉగ్రరూపం దాల్చుతున్న కృష్ణమ్మ

ఉగ్రరూపం దాల్చుతున్న కృష్ణమ్మ

నందికొండ : కృష్ణమ్మ పరువళ్లు శాంతించినట్లు కనిపించినా ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణ మ్మ ఉగ్రరూపం దాల్చుతూ దిగువకు పరుగుళ్లు తొక్కుతుంది. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ పూర్తి స్థాయిలో నిండి నిండుకుండలా మారింది.  దీంతో వచ్చిన వరద నీటిని వచ్చినట్లే క్రస్ట్‌ గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు 188094 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో డ్యాం 18 క్రస్ట్‌ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి 145242 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  శ్రీశైలం నుంచి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో ఆధారంగా నాగార్జునసాగర్‌ డ్యాం క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. 

నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ పూర్తి నీటి సామర్థ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను 589.70 చేరుకొని 311.1486 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి క్రస్ట్‌ గేట్ల ద్వారా 145242 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 4287 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1200 క్యూసెక్కులు,  కుడికాల్వ ద్వారా 8604 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 28461 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి మొత్తం 188094 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుంది. శ్రీశైలానికి 296328 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో 8 క్రస్ట్‌ గేట్ల ద్వారా దిగువ ఉన్న నాగార్జునసాగర్‌ డ్యాం  నీటిని  విడుదల చేస్తున్నారు.  శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు మేరకు నీరు నిల్వ ఉంది. 

 

VIDEOS

logo