ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 23, 2020 , 01:06:54

రెవెన్యూకి జయహో

రెవెన్యూకి జయహో

రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతుల భారీ ట్రాక్టర్ల ర్యాలీ 

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి అన్నదాతల క్షీరాభిషేకం 

మోత్కూరు : ఇన్నేండ్లు భూ సమస్యలతో అవస్థలు పడిన తమకు తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంతో కష్టాలు తీరినట్లేనని అన్నదాతలు సంబురాలు చేసుకున్నారు. మంగళవారం మోత్కూరు మండల కేంద్రంలో రైతులు భారీ ఎత్తున ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. నూతన రెవెన్యూ చట్టానికి స్వాగతం తెలుపుతూ సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. 

అనంతరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కొణతం యాకుబ్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఇంతటి గొప్ప నిర్ణయాన్ని ఏ ప్రభుత్వం చేపట్టలేదన్నారు. రైతుల కోసం కష్టపడుతున్న  సీఎం కేసీఆర్‌కు ప్రజల అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. కార్యక్రమంలో రైతు సహకార సంఘం చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, మండలాధ్యక్ష, కార్యదర్శులు పొన్నేబోయిన రమేశ్‌, గజ్జి మల్లేశ్‌, రైతు బంధు మండల కో ఆర్డినేటర్‌ కొండ సోంమల్లు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బొల్లేపల్లి వెంకటయ్య, కౌన్సిలర్లు పురుగుల వెంకన్న, బొడ్డుపల్లి కల్యాణ్‌ చక్రవర్తి, కూరెళ్ల కుమారస్వామి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు జంగ శ్రీను, రైతులు పురుగుల మల్లయ్య, గజ్జి నర్సింహ, సామ పద్మారెడ్డి, దబ్బెటి రమేశ్‌, నాయకులు చింతల విజయభాస్కర్‌రెడ్డి, దామరోజు శ్రీకాంతాచారి, దాసరి తిరుమలేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

అడ్డగూడూరులో... 

అడ్డగూడూరు : సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. మండల కేంద్రంలో రైతులు సుమారు 150 ట్రాక్టర్లతో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామని తెలిపారు. 

కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ పొన్నాల వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కోఆప్షన్‌ మెంబర్‌ గుండిగ జోసఫ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పూలపల్లి జనార్దన్‌రెడ్డి, మండల కోఆప్షన్‌ మెంబర్‌ ఆంథోని, టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ మండలాధ్యక్షుడు జక్కుల యాదగిరి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.


 

VIDEOS

logo