సోమవారం 01 మార్చి 2021
Yadadri - Sep 29, 2020 , 00:48:24

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన

ఆలేరు : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆలయ ఈవో గీత సోమవారం పరిశీలించారు. ప్రధానాలయంలో బాహ్యాప్రాకారం, అంతర్‌ ప్రాకారానికి డంగుసున్నంతో చేపట్టిన పనులను పరిశీలించారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి లీకేజీలపై వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు పూర్తిస్థాయిలో పరిశీలన చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలనుసారం కొనసాగాల్సిన పనులను క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ప్రధానాలయంలోని గర్భగుడి ద్వారాలకు బంగారు తొడుగు, లోపలి రాజగోపురాలను వెండి తొడుగు, బాహ్య రాజగోపురాలను ఇత్తడి తొడుగులకు సంబంధించిన పనులపై ఆరా తీశారు. రింగురోడ్డు విస్తరణలో భాగంగా షాపులు, ఇండ్లు కోల్పోయిన బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానాలయం తిరువీధుల్లో జరుగుతున్న ఫ్లోరింగ్‌, శివాలయానికి విద్యుత్‌ వంటి పనులను కిషన్‌రావు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. పనుల పురోగతిపై స్థపతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వైటీడీఏ ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి, ఉపస్తపతులు, ఇంజినీర్లు, తదితరులు పాల్గొన్నారు.
VIDEOS

logo