ధూపం, దీపం నిరంతరం

లాక్‌డౌన్‌లోనూ అర్చకులకు వేతనాలు
ఉమ్మడి జిల్లాలో 417 మంది
అర్చకులకు ప్రభుత్వం భరోసా..
హర్షం వ్యక్తం చేస్తున్న అర్చకులు
నల్లగొండ కల్చరల్ : వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ధూప, దీప, నైవేద్యం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పురాతన ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు లాక్డౌన్ నేపథ్యంలోనూ ఇబ్బందులు లేకుండా ప్రతి మాసం ప్రభుత్వం వేతనాలను అందిస్తుండడంతో ఆర్థ్ధికంగా ఇబ్బందులు లేకుండా అర్చకులు జీవనం కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 417 పురాతన ఆలయాల్లో ఆ పథకం అమలవుతుండగా లాక్‌డౌన్‌లోనూ నిత్యపూజలు కొనసాగాయి. ప్రతి మాసం ఆయా ఆలయాలకు ప్రభుత్వం రూ.25.2 లక్షల నిధులు కేటాయిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో 417 ఆలయాలు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధూప, దీప, నైవేద్యం పథకంతో 417ఆలయాల్లో నిత్య పూజలు కొనసాగిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 173, సూర్యాపేట జిల్లాలో 114, యాదాద్రి భువనగిరి జిల్లాలో 130 పురాతన ఆలయాలున్నాయి.
అర్చకులకు ప్రతి నెల రూ. 6వేలు
ధూప, దీప, నైవేద్య పథకం కింద ఎంపికైన ఆలయాల్లో పనిచేసే అర్చకులకు ప్రతినెలా ప్రభుత్వం వేతనం, ఖర్చుల నిమిత్తం రూ. 6వేలు అందిస్తోంది. గత సమైక్యపాలనలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఆలయాల్లో అర్చకులకు కేవలం రూ. 2500 ఇచ్చే వారు. దీన్ని స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రూ. 6 వేలకు పెంచారు. ఈ విధానం అమల్లోకి రావడంతో ఆలయాల్లో నిత్యపూజలు చేస్తుండడంతో భక్తులకు అర్చకులు అందుబాటులో ఉంటారు. ప్రభుత్వం ఇచ్చే రూ.ఆరు వేలల్లో రెండు వేలు ప్రతి మాసం ధూప, దీపం, నైవేద్యం, ఆలయ శుభ్రతకు ఖర్చుచేయాలి. మిగిలిన రూ. 4వేలు అర్చకుడి వేతనంగా ఉపయోగిస్తారు.
పెండింగ్ లేకుండా వేతనాలు
పురాతన ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల(బ్రాహ్మణుల)కు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వ సీఎం కేసీఆర్ ధూప, దీప, నైవేద్య పథకాన్ని అమలు చేస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి మాసం రూ.6వేల వేతనాన్ని పెండింగ్ లేకుండా ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా అందజేస్తోంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పురాతన ఆలయాల్లో నిత్య పూజలు కొనసాగుతుండడంతో భగవంతుడి దర్శనం భక్తులకు లభిస్తోంది.
-కె.మహేంద్రకుమార్, దేవాదాయ, ధర్మదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్
పురాతన ఆలయాలకు పూర్వవైభవం
పురాతన ఆలయాలకు ధూప, దీప, నైవేద్యం పథకం అమలుతో ఆయా ఆలయాలు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయి. దేశంలో ఏ ప్రభుత్వం కల్పించని విధంగా సీఎం కేసీఆర్ అర్చకులకు భరోసా కల్పిస్తున్నారు. దీంతో ఆలయాల్లో నిత్య పూజలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ఆలయాలకు కూడా పథకాన్ని వర్తింపచేయడంతోపాటు వీరికికూడా 010తో వేతనాలు అందిస్తే బాగుంటుందని అకాంక్షిస్తున్నాం.
-దౌలతాబాద్ వాసుదేవశర్మ, రాష్ట్ర అధ్యక్షుడు, ధూప, దీప నైవేద్య పథకం
పురాతన ఆలయాల్లో నిత్య పూజలు
పురాతన ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులను ఆదుకునే విధంగా ప్రభుత్వం ధూప, దీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తుంది. లాక్‌డౌన్‌తో చాలా వరకు ఎలాంటి శుభకార్యాలు, పెండ్లిళ్లు, గృహప్రవేశాలు చేయకపోవడంతో తీవ్ర ఆర్థ్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ప్రభుత్వం ధూప, దీప, నైవేద్య పథకంలోని అర్చకులకు లాక్డౌన్లో సైతం పెండింగ్ లేకుండా వేతనాలు అందించింది. ఇందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
-పెన్నా మోహన శర్మ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ధూప,
దీప నైవేద్య అర్చక సమాఖ్య, నల్లగొండ
తాజావార్తలు
- బెంగాల్ పోరు : ఐదుగురు ఎమ్మెల్యేలు గుడ్‌బై..దీదీ పార్టీకి ఎదురుదెబ్బ!
- 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఘనంగా నిర్వహిస్తాం: సీఎం కేసీఆర్
- స్వచ్ఛంద ఈపీఎఫ్‌వో సభ్యులకు ‘ప్రత్యేక నిధి’!
- టీటీవీ దినకరణ్‌తో జతకట్టిన ఓవైసీ
- మేడ్చల్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- మచ్చలేని వ్యక్తిత్వం సురభి వాణీదేవి సొంతం
- ఎన్ఐఏకు.. ముఖేష్ ఇంటి వద్ద కలకలం రేపిన వాహనం కేసు దర్యాప్తు
- ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్‌కు చేదు అనుభవం
- గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల తుది ఫలితాలు వెల్లడి
- మార్చి 31 వచ్చేస్తోంది.. ఐటీఆర్‌తో ఆధార్ జత చేశారా?