శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 14, 2020 , 00:51:41

ఆడపడుచులకు అండగా ప్రభుత్వం

ఆడపడుచులకు అండగా ప్రభుత్వం

  ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి 

వలిగొండ:  ఆడపడుచులకు అండగా ప్రభుత్వం ఉంటుందని భువనగిరి  ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని దేవీశ్రీ గార్డెన్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆయన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ   పేదలు ఇబ్బందులు పడకూడదనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే పైళ్ల ఫౌండేషన్‌ సౌజన్యంతో నూతన వధూవరులకు పోచంపల్లి పట్టు చీరలతోపాటు, దోవతి, కండువాలను  అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేశ్‌రాజ్‌, స్థానిక సర్పంచ్‌ బోళ్ల లలితాశ్రీనివాస్‌, ఎంపీటీసీ పల్సం రమేశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు  సుర్కంటి వెంకట్‌రెడ్డి, చిట్టెడి వెంకట్‌రాంరెడ్డి, ఏఎంసీ చైర్‌ పర్సన్‌ కునపూరి కవిత, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ పనుమటి మమతా నరేందర్‌రెడ్డి, మదర్‌ డెయిరీ డైరెక్టర్‌ గూడూరు శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్‌ నాగలక్ష్మి, టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు డేగల పాండరి, పట్టణ అధ్యక్షుడు అయిటిపాముల రవీంద్ర, పార్టీ  మండల కార్యదర్శులు మామిండ్ల రత్నయ్య, పైళ్ల మల్లారెడ్డి, యూత్‌ అధ్యక్షులు ఎమ్మె లింగస్వామి, ఎడవెల్లి శాంతి కుమార్‌  పాల్గొన్నారు.


VIDEOS

logo