భువనగిరి కలెక్టరేట్: జిల్లా అబివృద్ధికి, ప్రణాళికలు రూపొందించడానికి జిల్లా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2019-20(చేతి గణాంకాల పుస్తకం) ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. జిల్లా ప్రణాళిక శాఖ రూపొం దించిన 2019-20 చేతి గణాంకాల పుస్తకాన్ని గురువారం ఆవిష్కరించి మాట్లాడారు.
చేతి గణాంకాల పుస్తకంలో జిల్లా జనాభా, అన్ని శాఖల సమగ్ర సమాచారంతో పాటు, వర్షాపాతం, పంటల సాగు, జిల్లాలో అందుబాటులో ఉన్న మౌలిక వనరులు, బావులు, కాలువల కింద సేద్యం తదితర సమగ్ర సమాచారం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీవో మాన్యానాయక్, డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, స్టాటిస్టికల్ అధికారి రాజ్యం, డిప్యూటీ స్టాటిస్టికల్ అధికారి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.