కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి

మోత్కూరు : మోత్కూరు మండలంలో 15 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ చైతన్యకుమార్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని పీహెచ్సీలో 63 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 15 మందికి పాజిటివ్ సోకినట్లు చెప్పారు. మోత్కూరు పురపాలిక కేంద్రంలో 10 మందికి, పొడిచేడు గ్రామంలో 5 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు.
సంస్థాన్ నారాయణపురంలో 7గురు
సంస్థాన్‌నారాయణపురం : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 47 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యురాలు దీప్తీ తెలిపారు. వారికి ప్రభుత్వం అందించిన మెడికల్ కిట్లను పంపిణీ చేసి హోంక్వారంటైన్ చేశామని అన్నారు.
ఆత్మకూరు(ఎం) లో 7గురు
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంలోని పీహెచ్సీలో మంగళవారం వివిధ గ్రామాలకు చెందిన 41 మందికి ర్యాపిడ్ పరీక్షలు చేయగా 7గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి ప్రణీష తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులను 14 రోజుల పాటు హోంక్వారంటైన్లో ఉంచినట్లు తెలిపారు.
తుర్కపల్లిలో 8మందికి
తుర్కపల్లి : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 38మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 8మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి చంద్రారెడ్డి తెలిపారు. మాదాపూర్ గ్రామాంలో 2, వెంకటాపూర్‌లో 1, చిన్నలక్ష్మాపూర్1, వాసాలమర్రి 2, వడపర్తిలో ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ అయిందన్నారు. బాధితులందరిని హోంక్వారంటైన్ చేశామన్నారు.
ఆలేరులో 10 మందికి
ఆలేరుటౌన్ : మండలంలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శారాజిపేట పీహెచ్సీ ఇన్చార్జి డాక్టర్ రాజేందర్ తెలిపారు. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో మొబైల్ కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలలో 50 మందిని పరీక్షించగా 10 మందికి పాజిటివ్‌గా నిర్ధారించినట్లు ఆయన తెలిపారు.
వలిగొండ మండలంలో 14 మందికి
వలిగొండ : వలిగొండ మండలంలో మరో 14 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారులు డాక్టర్ సుమన్‌కల్యాణ్, డాక్టర్ కిరణ్‌కుమార్ మంగళవారం తెలిపారు. మండలంలోని వలిగొండ, వర్కట్‌పల్లి పీహెచ్‌సీల్లో 133 మందికి ర్యాపిడ్ కిట్ పరీక్షలు నిర్వహించగా 14 మందికి కరోనా వచ్చిందని, కరోనా సోకిన వారిని హోం క్వారంటైన్ చేసి చికిత్సను అందిస్తున్నట్లు వారు తెలిపారు
అడ్డగూడూరులో ముగ్గురికి
అడ్డగూడూరు : మండలంలోని పీహెచ్సీలో మంగళవారం 24 మందికి కరోనా పరీక్షలు చేయగా చౌళ్లరామారం గ్రామంలో ఒక్క పాజిటివ్, చిన్నపడిశాలలో 2 పాజిటివ్ కేసులు వచ్చినట్లు మండల వైద్యాధికారి నరేశ్ తెలిపారు.
పోచంపల్లి మండలంలో ఆరుగురికి
భూదాన్‌పోచంపల్లి : మండల పరిధిలో మంగవారం ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి యాదగిరి తెలిపారు. ఇంద్రియాలలో 2, హైదర్‌పూర్ 2, పెద్దరావులపల్లిలో 1, పోచంపల్లి రామ్‌నగర్‌లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా వారంతా హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు చెప్పారు. ఇంద్రియాల గ్రామం నుంచి ఒకరిని బీబీనగర్ ఎయిమ్స్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.
బొమ్మలరామారంలో
8మందికి
బొమ్మలరామారం : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 36మందికి సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 8మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి శ్రవణ్‌కుమార్ తెలిపారు.
బీబీనగర్ మండలంలో ఏడుగురు..
బీబీనగర్ : మండలంలోని రెండు ఆరోగ్య కేంద్రాల్లో కలిపి మంగళవారం 115 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్లు తహసీల్దార్ వెంకట్‌రెడ్డి తెలిపారు.
గుండాల మండలంలో 11 మందికి
గుండాల: గ్రామాల్లో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను నివారించడంలో భాగంగా ప్రతి గ్రామంలో ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని మరిపడిగె గ్రామంతో పాటు మండల కేంద్రంలో నిర్వహించిన 71 ర్యాపిడ్ పరీక్షల్లో 11 మందికి పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
రామన్నపేటలో 11మందికి....
రామన్నపేట: రామన్నపేట మండలంలో మంగళవారం 11మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి రంజిత్‌రెడ్డి తెలిపారు. మండలంలో 61మందికి పరీక్షలు నిర్వహించగా రామన్నపేటలో నలుగురికి, వెల్లంకి, మునిపంపుల, ఇంద్రపాలనగరం గ్రామాల్లో ఇద్దరి చొప్పున, ఉత్తటూరులో ఒక్కరు ఉన్నారు.
చౌటుప్పల్ మండలంలో
చౌటుప్పల్ : మండలంలోని అన్ని గ్రామాల్లో మొబైల్ వాహనం ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని సర్పంచ్ నారెడ్డి అండాలు సాయిరెడ్డి తెలిపారు. దామెర గ్రామంలో మండల వైద్యాధికారి డా. శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో కరోనా క్యాంప్‌ను నిర్వహించారు. గ్రామంలో మొత్తం 35మందికి కరోనా పరీక్షలు చేశారు.
ఆలేరు మండలంలో
ఆలేరు : మారుమూల గ్రామాల్లో సైతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ముందుస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. గ్రామాల్లోని వీధులను శుభ్రపరిచి, వైరస్ నిర్మూలనకు పాటుపడుతున్నారు. మంగళవారం యాదగిరిగుట్ట మండలంలోని దాతరుపల్లిలో సర్పంచ్ బైరగాని చిన్నపుల్లయ్యగౌడ్ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు గోర్ల అయిలయ్య, చుక్కల కిష్టమ్మ, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- రాఫెల్ స్ఫూర్తితో.. ‘పంజాబ్ రాఫెల్’ వాహనం
- కురుమల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ : ఎమ్మెల్సీ కవిత
- టీ బ్రేక్..ఇంగ్లాండ్ 144/5
- ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్.. ఇండియాలో బెంగళూరే బెస్ట్
- ఉప్పెన చిత్ర యూనిట్‌కు బన్నీ ప్రశంసలు
- ఓటీటీలో పోర్న్ కూడా చూపిస్తున్నారు : సుప్రీంకోర్టు
- సవాళ్లను ఎదుర్కొంటున్న భారత సైన్యం : సీడీఎస్ బిపిన్ రావత్
- షాకింగ్ : లైంగిక దాడిని ప్రతిఘటించిన దళిత బాలిక హత్య!
- ప్రమీలా జయపాల్‌కు అమెరికాలో అత్యున్నత పదవి
- ఓటీటీ నియంత్రణలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు