e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, November 30, 2021
Home తెలంగాణ దివ్యాంగులకు టెలీ సేవలు

దివ్యాంగులకు టెలీ సేవలు

  • భవిత కేంద్రాలు తెరిచే వరకు
  • రాష్ట్రంలో తొలిసారిగా దివ్యదిశ

ఆలేరు టౌన్: కరోనా కారణంగా భవిత కేంద్రాలు మూత పడ్డాయి. శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఫిజియోథెరఫీ సేవలు, ఆటపాటలతో కూడిన విద్యాబుద్ధులు నేర్పేం దుకు భవిత కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 15 భవిత కేంద్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెలీ, ఆన్‌లైన్ సేవలను విద్యాశాఖ నిర్వహిస్తుంది. ఇంక్లూ జీవ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్‌పీ)ల ద్వారా అందిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇండ్ల వద్ద పిల్లలు వైకల్యం, మానసిక ఇబ్బందులతో సతమతమవు తున్నారని ఐఈఆర్‌పీలు టెలీ సర్వీస్ ద్వారా తల్లిదండ్రులకు సూచనలు అందిస్తూ సేవలు అందేలా చూస్తున్నారు.

దీంతో పాటు ఆన్‌లైన్‌లో డిజిటల్ పాఠాలను నిర్వహిస్తున్నారు. పిల్లలు వినేలా చొరవ తీసుకుం టున్నారు. దివ్యాంగు లైన చిన్నారులకు వారంలో రెండు సార్లు టెలీ సేవలు అందిస్తున్నారు. ఎటు కదల్లేని పిల్లల తల్లిదండ్రులకు సెల్‌ఫోన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. వారంలో 5రోజులు ఇలా చేస్తున్నారు. మానసిక వైకల్యం ఉన్నవారికి, వైకల్యంతో బాధపడేవారికి పలు రకాల వ్యాయామాలు అందించడంతో పాటు ఎలాంటి ఆహారం ఇవ్వాలో తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

- Advertisement -

3 మండలాల్లో దివ్యదిశ

ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో జీవన నైపుణ్యాలు మెరుగు పరిచేందుకు భవిత కేంద్రాలు ఎంతో తోడ్పడుతున్నాయి. కరోనా నేపథ్యంలో మూతపడిన సంగతి తెలిసిందే. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రత్యేక అవసరాల పిల్లలకు సాధారణ విద్యార్థుల మాదిరిగా సమాన హక్కులు ఉండాలి. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో దివ్యదిశ పేరిట వినూత్న పద్ధతిలో ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రత్యేక విద్యను అందించేందుకు వీడియో, ఆడియోను రూపొందించారు. ఇటీవలనే జిల్లాలో మొదట ప్రయోగాత్మకంగా భువనగిరి, వలిగొండ, రామన్నపేట మండలాల్లో అమలు చేస్తున్నారు.

శారీరక వైకల్యంతో పాటు ఇతర సమస్యలు ఉన్న చిన్నారులకు ఇంటి వద్దే తర్ఫీదు, విద్యను కొనసాగించేందుకు ప్రత్యేకంగా 30 వీడియోలు, 30 ఆడియోలను రూపొందించారు. 30 రోజులకు సరిపడా షెడ్యూల్‌ను తయారు చేశారు. ఏ రోజు ఏ అంశాల మీద విద్యను అందించాలో ప్రణాళికను రూపొందించారు. ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూపుల్లో రోజుకో అంశంపై వీడియోను అప్లోడ్ చేసి వారికి బోధన అందిస్తున్నారు. వీటిని తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చూపించి వాటి ఆధారంగా నేర్పిస్తున్నారు. వీడియోలు పంపిన తరువాత ఐఈఆర్‌పీలు పర్యవేక్షణ చేస్తారు. త్వరలో దివ్య దిశను అన్ని మండలాల్లో అమలు చేయనున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement