మంగళవారం 27 అక్టోబర్ 2020
Yadadri - Sep 26, 2020 , 01:12:03

కలెక్టర్‌కు పీపీఈ కిట్లు అందజేత

కలెక్టర్‌కు పీపీఈ కిట్లు అందజేత

భువనగిరి కలెక్టరేట్‌ : చౌటుప్పల్‌ దివిస్‌ లేబోరేటరీ ప్రతినిధులు శుక్రవారం కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ను కలిసి పీపీఈ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. దివిస్‌ కంపెనీ ఆధ్వర్యంలో కరోనా కట్టడిలో భాగంగా సుమారు రూ.14 లక్షలతో పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సాంబశివరావు, దివిస్‌ లేబోరేటరీ ప్రతినిధులు వెంకటరాజు, బీకేకే చౌదరి, సీహెచ్‌ శివకోటేశ్వరరావు పాల్గొన్నారు.logo