కరోనా కాలం... జరపైలం

రోజు రోజుకు పెరుగుతున్న కేసులు
వలిగొండ : వలిగొండ మండల వ్యాప్తంగా మరో 16మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని మండల వైద్యులు డా. సుమన్‌కల్యాణ్, కిరణ్‌కుమార్ తెలిపారు. వర్కట్‌పల్లి, వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 50 మందికి పరీక్షలు నిర్వహిస్తే 16 మందికి కరోనా పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చిందన్నారు. కరోనా బాధితులకు పైళ్ల ఫౌండేషన్ పోషకాహార కిట్లను అందజేసి హోంక్వారంటైన్ చేసినట్లు చెప్పారు.
భూదాన్‌పోచంపల్లి మండలంలో...
భూదాన్‌పోచంపల్లి : భూదాన్‌పోచంపల్లి మండల పరిధిలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి యాదగిరి తెలిపారు. ఇంద్రియాలలో 3, పిలాయిపల్లిలో ఒకటి నమోదు కాగా వీరంతా హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు ఆయన తెలిపారు.
మోటకొండూర్ మండలంలో...
మోటకొండూర్ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 9మందికి పరీక్షలు నిర్వహిస్తే ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి రాజేందర్‌నాయక్ తెలిపారు. కరోనా బాధితుడిది మోటకొండూరేనని, అతడిని హోంక్వారంటైన్ చేసి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తిస్తున్నామన్నారు.
సంస్థాన్ నారాయణపురంలో...
సంస్థాన్ నారాయణపురం : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 36 మందికి ర్యాపిడ్ కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి దీప్తి తెలిపారు.
బొమ్మలరామారంలో...
బొమ్మలరామారం : మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 17 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి శ్రవణ్‌కుమార్ తెలిపారు.
అంకిరెడ్డిగూడెంలో...
చౌటుప్పల్ రూరల్ : మండలపరిధిలోని అంకిరెడ్డిగూడెంలో శనివారం మొబైల్ టీమ్ 25 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా, ఎవరికీ పాజిటివ్ రాలేదని మండల వైద్యాధికారి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.
నీర్నెంములలో...
రామన్నపేట: మండలంలోని నీర్నెంముల గ్రామంలో క్యాంపును ఏర్పాటు చేసి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు మండల వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. సర్పంచ్ ముత్యాల సుజాతరవి, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు ఆవుల నరేందర్, ఏఎన్ఎం కవిత, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
నలుగురికి కరోనా పాజిటివ్...
మండలంలో 86 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా రామన్నపేటలో ఇద్దరికి, సిరిపురం, ఎన్నారం గ్రామాల్లో ఒక్కొక్కరికి పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు మండల వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. వీరికి హోంఐసోలేషన్ కిట్లను అందించి చికిత్స నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
తుర్కపల్లిలో...
తుర్కపల్లి : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 27 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి చంద్రారెడ్డి తెలిపారు. బాధితులంతా ఇతర ప్రాంతాలకు చెందిన వారేనని ఆయన చెప్పారు. వారికి హోం ఐసోలేషన్ కిట్లను అందజేసినట్లు తెలిపారు.
మోత్కూరులో...
మోత్కూరు : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 38మందికి ర్యాపిడ్ కరోనా పరీక్షలను నిర్వహిస్తే మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ముగ్గురికి, దత్తప్పగూడెంలో ఒకరికి, దాచారంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని మండల పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ఆకవరం చైతన్యకుమార్ తెలిపారు. వీరికి మెడికల్ కిట్లను పంపి ణీ చేసి హోంక్వారంటైన్ చేశామని తెలిపారు.
గుండాలలో...
గుండాల : గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 35 కరోనా పరీక్షలు నిర్వహిస్తే ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి డా.ఆర్.శ్రీనివాస్ తెలిపారు. గుండాలలో ఇద్దరికి, గంగాపురంలో ఒకరికి కరోనా వచ్చిందని చెప్పారు.
యాదగిరిగుట్టలో...
ఆలేరు : యాదగిరిగుట్ట పీహెచ్సీలో మొత్తం 16మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే మహబూబ్‌పేట గ్రామానికి చెంది న ఒకరు, చొల్లేరు గ్రామానికి చెందిన మరొకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి వంశీకృష్ణ తెలిపారు.
బీబీనగర్‌లో...
బీబీనగర్ : మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 51మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 8 మందికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారులు ప్రవీణ్, గీత తెలిపారు. ఈ కరోనా బాధితులకు మెడికల్ ఐసోలేషన్ కిట్లను అందజేసి, హోంక్వారంటైన్ లో ఉంచినట్లు చెప్పారు. వీరి ప్రాథమిక కాంటాక్టులను గుర్తించే పనిలో సిబ్బంది ఉన్నారన్నారు.