శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Sep 22, 2020 , 01:14:27

పల్లెల్లో కరోనా విజృంభణ

పల్లెల్లో కరోనా విజృంభణ

రోజురోజుకు గ్రామాల్లో పెరుగుతున్న కేసులు

కరోనా బారినపడ్డ వారికి హోం ఐసొలేషన్‌ కిట్లు అందజేసిన వైద్యులు

మాస్కులు, భౌతిక దూరం పాటించాలని సూచన

ఆలేరు: యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా పలు గ్రామాలకు చెందిన నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. సోమవారం యాదాద్రి దేవస్థానంలో 44 మందితోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరో 32 మందికి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా, యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన ఇద్దరికి, మల్లాపురానికి చెందిన ఒకరికి, మండలానికి చెందిన మరొకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి వంశీకృష్ణ తెలిపారు.

ఆలేరు టౌన్‌ : ఆలేరు మండలంలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని డాక్టర్లు రాజేందర్‌, శ్రవణ్‌ తెలిపారు. మండల పరిధిలో మొత్తం 71 మందికి పరీక్షలు నిర్వహించగా, 10 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు.

చౌటుప్పల్‌ 16 మందికి...

చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌లో 16 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి డా. శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. స్థానిక సీహెచ్‌సీలో 75 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 16 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. 

రామన్నపేటలో 8 మందికి...

రామ్నపేట:మండల కేంద్రంలో 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి రవికుమార్‌ తెలిపారు. సోమవారం మండలంలో 93మందికి పరీక్షలు నిర్వహించగా, రామన్నపేట, పల్లివాడలో ఇద్దరికి, సిరిపురం, దుబ్బాక, ఎన్నారం,కొమ్మాయిగూడెం గ్రామా ల్లో ఒక్కొక్కరికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. వీరికి హోం ఐసొలేషన్‌ కిట్లను అందజేసినట్లు వైద్యులు తెలిపారు.

సంస్థాన్‌నారాయణపురంలో 8 మందికి..

సంస్థాన్‌నారాయణపురం : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 30 మందికి పరీక్షలు నిర్వహించగా, 8 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి దీప్తి తెలిపారు.

బీబీనగర్‌లో 10 మందికి..

బీబీనగర్‌: మండలంలోని బీబీనగర్‌, కొండమడుగు పీహెచ్‌సీలలో సోమవారం 68 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 10 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారులు ప్రవీణ్‌, గీత తెలిపారు.

శారాజీపేట పీహెచ్‌సీలో ఐదుగురికి...

ఆలేరురూరల్‌ : మండలంలోని శారాజీపేట పీహెచ్‌సీలో సోమవారం 41 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఐదుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని శారాజీపేట పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రవణ్‌కుమార్‌ తెలిపారు.

మోటకొండూరులో నలుగురికి...

మోటకొండూరు : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 19 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, నలుగురి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి రాజేందర్‌నాయక్‌ తెలిపారు. కరోనా సోకిన వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

రాజాపేటలో ఒకరికి...

రాజాపేట : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 19 మందికి పరీక్షలు నిర్వహించగా, ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి శివవర్మ తెలిపారు. కరోనా సోకిన వ్యక్తిని హోం ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ఆత్మకూరు(ఎం)లో ఐదుగురికి...

ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 26 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు చేయగా, ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి ప్రణీష తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు మండలంలోని పల్లెర్లలో ప్రతి ఇంటి ముందు సర్పంచ్‌ నాయిని నర్సింహారెడ్డి హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు.

మోత్కూరులో 8 మందికి..

మోత్కూరు : మోత్కూరు మండలంలో 8మందికి కరోనా సోకిందని మండల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ చైతన్యకుమార్‌ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 58 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఇద్దరికి, దాచారంలో ఐదుగురికి, కొండాపురంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలపారు. వీరికి మెడికల్‌ కిట్లను అందజేసి హోంక్వారంటైన్‌ చేశామన్నారు.

వలిగొండ మరో 13 మందికి..

వలిగొండ: వలిగొండ మండలంలో మరో 13 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు డాక్టర్‌ సుమన్‌ కల్యాణ్‌, డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల పరిధిలోని వలిగొండ, వేములకొండ, వర్కట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 118మందికి పరీక్షలు నిర్వహించగా, 13మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, వారిని హోంక్వారంటైన్‌ చేసి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

అడ్డగూడూరులో నలుగురికి...

అడ్డగూడూరు: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 30 మందికి కరోనా  పరీక్షలు చేయగా, అడ్డగూడూరులో 2, అజీంపేటలో 1, గట్టుసింగారంలో 1 పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు మండల వైద్యాధికారి నరేశ్‌ తెలిపారు. వారికి ఐసొలేషన్‌ కిట్లను అందజేసి హోంక్వారంటైన్‌ చేసినట్లు ఆయన తెలిపారు.    

భూదాన్‌పోచంపల్లిలో ఏడుగురికి... 

భూదాన్‌పోచంపల్లి : మండల పరిధిలో సోమవారం ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి యాదగిరి తెలిపారు. ఇంద్రియాలలో 1, శివారెడ్డిగూడెంలో 1, పోచంపల్లి భావనాఋషిపేటలో 1, లక్ష్మణ్‌గన్‌లో 1, హైదరాబాద్‌కు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, వీరందరూ హోంక్వారంటైన్‌లో ఉన్నారని తెలిపారు.

ఆలయ సిబ్బందికి  పరీక్షలు


ఆలేరు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వహించే ఆలయ సిబ్బందికి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించారు. ఆలయ ఈవో, ప్రధానార్చకులు, ఉప అర్చకులతోపాటు వివిధ అనుబంధ ఆలయాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. దేవాలయంలో మొత్తం 70 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందరికి  నెగెటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి వంశీకృష్ణ తెలిపారు. 


VIDEOS

logo