మంగళవారం 27 అక్టోబర్ 2020
Yadadri - Sep 24, 2020 , 01:32:04

కరోనాతో పరేషాన్‌

కరోనాతో పరేషాన్‌

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు 

స్వీయనియంత్రణే శ్రీరామరక్ష 

మోటకొండూర్‌: మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం  మండలంతో పాటు పలు మండలాలకు చెందిన 12 మందికి కరోనా పరీక్షలు చేయగా మండల కేంద్రానికి చెందిన ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి రాజేందర్‌నాయక్‌ తెలిపారు. మండలంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్నందున  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కరోనా వచ్చిన వ్యక్తిని  హోం క్వారంటైన్‌లో ఉంచి వైద్యం చేస్తున్నామని తెలిపారు.  

తుర్కపల్లిలో ముగ్గురికి..

తుర్కపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  28 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇతర మండలాలకు చెందిన ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి చంద్రారెడ్డి తెలిపారు. అదే విధంగా సంగ్యాతండాలో మొబైల్‌ క్యాంపు ద్వారా 46 మందికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదన్నారు.

 బొమ్మలరామారంలో రెండు కేసులు ..

బొమ్మలరామారం: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14మందికి కరోనా పరీక్షలు చేయగా ఇద్దరికి  పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి శ్రవణ్‌కుమార్‌ తెలిపారు.

ఆలేరు మండలంలో నలుగురికి..

ఆలేరురూరల్‌: మండలంలోని శారాజీపేట  పీహెచ్‌సీలో  17మందికి కరోనా పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు  పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. 

అడ్డగూడూరులో ఒకరికి

అడ్డగూడూరు : మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో   15 మందికి  మందికి కరోనా  పరీక్షలు చేయగా ఒకరికి  పాజిటివ్‌   వచ్చినట్లు మండల వైద్యాధికారి నరేశ్‌ తెలిపారు.  

బీబీనగర్‌లో 10 మందికి ..

బీబీనగర్‌: మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 76 మందికి కరోనా పరీక్షలు చేయగా 10 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు. 

వలిగొండ మండలంలో 16 మందికి..

వలిగొండ: మండలంలోని వర్కట్‌పల్లి, వలిగొండ, వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 101 మందికి కరోనా పరీక్షలు చేయగా 16 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యులు  సుమన్‌కల్యాణ్‌, కిరణ్‌కుమార్‌ తెలిపారు.   

మోత్కూరులో ఇద్దరికి..

మోత్కూరు : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 23 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌  వచ్చినట్లు మండల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ కిశోర్‌కుమార్‌ తెలిపారు. వీరికి  హోంఐసొలేషన్‌ మెడికల్‌ కిట్లు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ చైతన్యకుమార్‌ పాల్గొన్నారు. 

రామన్నపేటలో ఒకరికి..

రామన్నపేట: మండలంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా   నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి కె.రవికుమార్‌ తెలిపారు.  63 మందికి  కరోనా పరీక్షలు చేయగా కక్కిరేణి గ్రామానికి చెందిన వ్యక్తికి పాజిటివ్‌ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

కరోనా అంతం 

కావాలని పాదయాత్ర

ఆలేరు: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి అంతం కావాలని నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన 50 మంది లయన్స్‌ క్లబ్‌ బృందం పాదయాత్ర చేపట్టింది. బుధవారం  భువనగిరి నుంచి పాదయాత్రగా వచ్చి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పాదాల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు కుమార్‌, బండారు వెంకన్న, శబరినాథ్‌, రమేశ్‌, భాస్కర్‌, జ్యోతి, మాధవి, రవీందర్‌, అనిశ్‌, ప్రశాంత్‌, సంధ్యారాణి, రాజు పాల్గొన్నారు. 

భువనగిరిలో.. 

భువనగిరి అర్బన్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తగ్గాలని కోరుతూ   వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని సాయిబాబా దేవాలయం నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం వరకు బుధవారం పాదయాత్ర నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో క్లబ్‌ సభ్యుడు ఐతరాములు, నాయకులు ఇరుకుల్ల రామకృష్ణ, శ్రీదేవి, రవికుమార్‌, కోటగిరి రామకృష్ణ, బండారు వెంకటేశ్వర్లు, బెలిదె మాధవి, మిట్టపల్లి జ్యోతి, రమేశ్‌, మురళి, రాజు పాల్గొన్నారు. 

logo