ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 08, 2020 , 00:55:59

పల్లెల్లో పంజా

పల్లెల్లో పంజా

జిల్లాలో రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా వైరస్‌ 

మోటకొండూర్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 46 మం దికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 11 మందికి పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి రాజేందర్‌నాయక్‌ తెలిపారు.కరోనా బాధితుల్లో మండల కేంద్రానికి చెందిన ఐదుగురు, ఇక్కుర్తి గ్రామానికి చెందిన ఒకరు, ఇతర మండలాలకు చెందిన ఐదుగురు ఉన్నారు. 

మోత్కూరులో 13 మందికి.. 

మోత్కూరు : మోత్కూరు పీహెచ్‌సీలో 81 మం దికి పరీక్షలు చేస్తే 13 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి డా. కిశోర్‌కుమార్‌ తెలిపారు.మోత్కూరు పురపాలిక కేంద్రం లో నలుగురు, మంగళిగడ్డలో నలుగురు, పొడిచేడులో ముగ్గురు, ముశిపట్లలో ఒకరు, అడ్డగూడూరు మండలంలోని డి రేపాక గ్రామంలో ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. వీరందరినీ హోం క్వారంటైన్‌ చేసినట్లు చెప్పారు. 

బొమ్మలరామారంలో...

బొమ్మలరామారం : మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో 26 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే ఆరుగురికి పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. వీరందరికీ మెడికల్‌ కిట్లను అందజేసి హోం క్వారంటైన్‌ చేసినట్లు చెప్పారు. 

తుర్కపల్లిలో ఆరుగురికి.. 

తుర్కపల్లి : మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో 26 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి చంద్రారెడ్డి తెలిపారు. అందులో పెద్దతండాలో 2, సంగ్యాతండా 1, భువనగిరికి చెందిన ఒకరికి, వడపర్తికి చెందిన ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. బాధితులందరినీ హోంక్వారంటైన్‌ చేశామని చెప్పారు. 

శారాజీపేట పీహెచ్‌సీలో... 

ఆలేరురూరల్‌ : మండలంలోని శారాజీపేట పీహెచ్‌సీలో 48 మందికి కరోనా పరీక్షలు చేస్తే ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు పీహెచ్‌సీ వైద్యాధికారి రాజేందర్‌ నాయక్‌ తెలిపారు. 

రాజాపేట మండలంలో... 

రాజాపేట : మండలంలో 12 మందికి కరోనా సోకినట్లు మండల వైద్యాధికారి శివవర్మ తెలిపారు. బొందుగుల 4, సోమారం 3, రాజాపేట 3,జాల 1 కరోనా కేసు నమోదైందన్నారు. బాధితులను హోంక్వారంటైన్‌లో ఉంచి చికిత్స అం దిస్తున్నామని తెలిపారు.

రామన్నపేటలో 24మందికి...

 రామన్నపేట : మండలంలో 24 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి రంజిత్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 119మందికి, మునిపంపుల ఆరోగ్యకేద్రంలో 66 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా రామన్నపేటలో ముగ్గురికి, వెల్లంకిలో ఐదుగురికి, ఇంద్రపాలనగరంలో తొమ్మిదిమందికి మునిపంపులలోఇద్దరికి, పల్లివాడ, కొమ్మాయిగూడెం, ఉత్తటూరు, సిరిపురం, శోభానాద్రిపురం గ్రామాల్లో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి తెలిపారు.

వలిగొండ మండలంలో....

వలిగొండ :  వలిగొండ, వేములకొండ, వర్కట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలల్లో 175 మందికి ర్యాపిడ్‌ కిట్లతో కరోనా పరీక్షలు నిర్వహిస్తే 30 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల వైద్యులు డాక్టర్‌ సుమన్‌కళ్యాణ్‌, డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. కరోనా బాధితులను హోం క్వారంటైన్‌ చేసి చికిత్సను అందిస్తున్నామని తెలిపారు.

ఆత్మకూరు(ఎం) లో...  

ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు కూరెళ్ల గ్రామం లో 123 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు చేయగా 16 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి ప్రణీష తెలిపారు.

గుండాల మండలంలో...  

గుండాల : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 41 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా 8 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి శ్రీనివాస్‌ తెలిపారు.

పోచంపల్లిలో... 

భూదాన్‌పోచంపల్లి : భూదాన్‌పోచంపల్లి మండలంలో 20 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి యాదగిరి తెలిపారు. ఇంద్రియాల 5, జూలూరు 1, హైదర్‌పూర్‌ 2, శివారెడ్డిగూడెం 2, జిబ్లక్‌పల్లి 1, పెద్దరావులపల్లి 2, మామిళ్లగూడెం 1, పోచంపల్లి 2, సాయినగర్‌ 1, పద్మానగర్‌లో 2, ఘట్‌కేసర్‌కు చెందిన ఒకరికి కరోనా నిర్ధారణ అయిందన్నారు. కరో నా బాధితులను హోంక్వారంటైన్‌లో ఉంచిన ట్లు చెప్పారు. 

యాదగిరిగుట్టలో... 

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 11 మంది కి కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారి వంశీకృష్ణ తెలిపారు. యాదగిరిగుట్టకు చెందిన నలుగురికి, కాచారం, మాసాయిపేట, రామాజిపేట, దాతరుపల్లి, అడ్డగూడూరుకు చెందిన ఒక్కొక్కరికి కరోనా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. బాధితులను హోంక్వారంటైన్‌ చేసినట్లు చెప్పారు.

VIDEOS

logo