చౌటుప్పల్ రూరల్: మండల పరిధిలోని దండు మల్కాపురం గ్రామాన్ని గురువారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సంద ర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు. అనంతరం స్థానిక జిల్లా పరిష త్ హైస్కూల్‌ను పరిశీలించి అక్కడ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యంశాల బోధనపై ఆరా తీశారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబాట్టారు. అనంతరం పాఠశాల అవరణలో మొక్క నాటారు.
అంతేకాకుండా తూఫ్రాన్‌పేట గ్రామంలోని కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అంతకుముందు అంకిరెడ్డి గూడెంలోని స్థానిక రైతుల మధ్య నెలకొన్న దారి వివాదాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో సూరజ్ కుమార్, ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో రాకేశ్‌రావు, తహసీల్దార్ గిరిధర్, సర్పంచ్ ఎలువర్తి యాదగిరి, ఎంపీటీ సీ చిట్టెంపల్లి శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.