బుధవారం 24 ఫిబ్రవరి 2021
Yadadri - Jun 22, 2020 , 23:03:19

చే‘నేత’ను ఆదరిద్దాం

చే‘నేత’ను ఆదరిద్దాం

చౌటుప్పల్‌ రూరల్‌ : ప్రతి ఒక్కరూ వారంలో రెండు రోజులు చేనేత వస్ర్తాలను ధరించాలని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని కొయ్యలగూడెం చేనేత సహకార సంఘాన్ని ఆయన సందర్శించారు. కరోనా మూలంగా చేనేత వస్ర్తాల నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో కార్మికులకు అండగా నిలువడానికి  చేనేత శాఖ మంత్రి కేటీఆర్‌, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చినట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా రూ.1.80లక్షల విలువైన చేనేత డబుల్‌కాట్‌ బెడ్‌షీట్లు, పిల్లో కవర్స్‌, షర్టుపీసులను నల్లగొండ జిల్లా సహకార బ్యాంక్‌ లిమిటెడ్‌ తరపున కొనుగోలు చేశారు.సర్వసభ్య సమావేశంలో సభ్యులకు వాటిని కానుకగా ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అనంతరం ఆయన చేనేత సహకార సంఘంలో నిల్వలను పరిశీలించి, కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్మికులను ఆదుకోవడానికి ప్ర త్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ దయాకర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ అందెల లింగం యాదవ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి, సీఈవో మదన్‌మోహన్‌, చేనేత సహకార సంఘం చైర్మన్‌ వర్కాల శ్రీమన్నారాయణ, చేనేత సంఘం నాయకులు గడ్డం జయశంకర్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

 పావలా వడ్డీకి స్వల్పకాలిక రుణాలు 

కరోనా నేపథ్యంలో రైతాంగానికి పావలా వడ్డీకి స్వల్పకాలిక రుణాలను అందిస్తున్నామని డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలపరిధిలోని చేనేత సహకార సంఘంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రూ.80 కోట్ల స్వల్పకాలిక రుణాలు మంజూరు అయినట్లు చెప్పారు. ఇప్పటికే రూ.45 కోట్లు పంపిణీ చేసినట్లు స్పష్టం చేశారు. రుణాల కోసం దరఖాస్తుకు ఈ నెల 27 వరకు గడువు ఉందన్నారు. వచ్చే నెల నుంచి దీర్ఘకాలిక రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లాలోని 8 సహకార సంఘాలకు రూ.4.80 కోట్ల క్యాష్‌ క్రెడిట్‌ ఇప్పించామన్నారు. బంగారు ఆభరణాలపై 11.75 శాతం ఉన్న వడ్డీ రేటును 0.75శాతం తగ్గించామన్నారు.ఎకరాకు రూ.లక్ష చొప్పున 10 లక్షల వరకు 92 పైసల వడ్డీకి మార్ట్‌గేజ్‌ లోన్లు అందిస్తున్నామన్నారు. 

VIDEOS

logo