చకచకా...రైతు వేదికల నిర్మాణం

ఉమ్మడి జిల్లాలో 222 చోట్ల నిర్మాణాలు
దసరా లోపు పూర్తి చేసేలా దిశానిర్దేశం
బేస్మెంట్ లెవల్లో 165, లెంటల్ లెవల్లో 50
రూప్ లెవల్ వరకు ఏడు చోట్ల నిర్మాణం
పూర్తయితే లాభసాటి సాగుపై చర్చకు ఆస్కారం
నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : లాభసాటి వ్యవసాయంపై చర్చలో రైతులను భాగస్వాములును చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. వ్యవసాయ నిపుణులు, సైంటిస్టులు, ఆదర్శరైతులు, ఇతర సాగు సంబంధిత ప్రముఖులతో పలుమార్లు సమగ్రంగా చర్చించింది. అనంతరమే రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మండల స్థాయిలో ఉన్న ఏఈఓ వ్యవసాయ క్లస్టర్లన్నింటిలో రైతు వేదికలు ఆదేశించింది. ఒక్కో క్లస్టర్ పరిధిలో ఒక్కో వేదిక నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌ను ఇస్తూ... అందుకోసం రూ. 22 లక్షల నిధులను కేటాయించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆద్వర్యంలో నిర్మాణాలు చేపట్టాలని సూచించింది. ఉపాధిహామీ పథకాన్ని కూడా దీనికి జోడించారు. నిర్మాణాలను వెనువెంటనే ప్రారంభించి అక్టోబర్ 23వ తేదీ నాటికి అన్ని రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 222 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. వీటి పరిధి అన్నింటిలో రైతు వేదికల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. జూలై మొదటివారం నుంచి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లావ్యాప్తంగా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వీటి నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. దాదాపు అన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. నల్లగొండ జిల్లాలో మొత్తం 31 మండలాల్లో 140 రైతు వేదికలను నిర్మిస్తున్నారు. ఇందులో ఐదుచోట్ల స్థానికులు స్వచ్ఛందంగా స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. మరో చోట స్థలానికి అవసరమైన డబ్బును సమకూర్చారు. ఇప్పటివరకు మొత్తం 140 చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో బేస్మెంట్ లెవల్ వరకు 100, లెంటల్ లెవల్ వరకు 35 నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో ఐదు చోట్ల మాత్రం రూప్ లెవల్ వరకు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. మరో పక్షం రోజుల్లో ఈ ఐదు చోట్ల వంద శాతం నిర్మాణం పూర్తి కానున్నది.
సూర్యాపేట జిల్లాలో మొత్తం 82 రైతు వేదికల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో బేస్మెంట్ లెవల్ వరకు 65, లెంటల్ లెవల్ వరకు 15, మట్టంపల్లి, మద్దిరాలలో మాత్రం రూప్ లెవల్‌వరకు కూడా నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. అన్నిచోట్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి అన్ని రూప్ లెవల్ వర కు పూర్తి కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
నిరంతరం నిర్మించాలని..
రైతు వేదికలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో వీటి నిర్మాణానికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను కూడా నియమించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో డివిజనల్ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పజెప్పా రు. వారు ప్రతి సోమ,శుక్రవారాల్లో ప్రగతిపై రెవెన్యూ, వ్యవసాయ, పంచాయితీరాజ్ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లతో సమీక్ష చేస్తున్నారు. నిర్మాణాలకు స్థలాల సమస్య లేదంటే ఇసుక ఇతర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వేగవంతంగా పూర్తి చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా క్షేత్రస్థాయిలో పరిష్కారం కాని సమస్య లుంటే జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకువస్తున్నారు. దీంతో ఇప్పటికే అన్ని చోట్ల నిర్మాణాలు మొదలుకావడంతో పాటు లెంటల్ లెవల్, కొన్నిచోట్ల రూప్ లెవల్ వరకు నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా నాటికి వీటిని రైతులకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంగా పనిచేస్తున్నా రు. యాసంగి సీజన్ ప్రారంభం నుంచి రైతు వేదికల నుంచే అన్ని రకాల వ్యవసాయ సమావేశాలు, ఇతర సాగు భేటీలు జరిగేలా చర్యలు చేపట్టారు.
వేగంగా పూర్తికి చర్యలు
రైతు వేదికల నిర్మాణంపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నాం. దాదాపు అన్ని చోట్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దసరా వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నిర్మాణాల్లో నూ తగిన నాణ్యత పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతు వేదికలు పూర్తయితే వ్యవసాయంలో మంచి చర్చ జరుగనుంది. అదేవిధంగా వ్యవసాయ అధికారులకు, రైతులకు మధ్య కూడా మరింత అనుబంధం ఏర్పడనుంది. ఇది వ్యవసాయంలో మార్పులకు దోహదపడుతుందని ఆశిస్తున్నాం.
-శ్రీధర్‌రెడ్డి, జేడీఏ నల్లగొండ
తాజావార్తలు
- ‘సత్యం’ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈడీ పిటిషన్ డిస్మిస్: టెక్ మహీంద్రా
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల ఆదాయం!
- మినీ వ్యానులో ఆవు.. వీడియో వైరల్
- ‘దృశ్యం’ కథ నిజంగా జరిగిందట..జార్జి కుట్టి నిజంగానే ఉన్నాడట!
- మహబూబ్‌నగర్ జిల్లాలో హ్యాండ్ గ్రెనేడ్ కలకలం
- కింగ్ కోఠి దవాఖానను సందర్శించిన సీఎస్
- సాయి ధరమ్ తేజ్‌తో సుకుమార్ సినిమా
- పెట్రోల్, డీజిల్‌లపై పన్నులకు కోత? అందుకేనా..!
- మూడో వారంలోనూ ‘ఉప్పెన’లా కలెక్షన్స్