సోమవారం 01 మార్చి 2021
Yadadri - Sep 17, 2020 , 01:48:56

విస్తరిస్తున్న కరోనా ఉధృతి

విస్తరిస్తున్న కరోనా ఉధృతి

ప్రజలందరూ మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలంటున్న వైద్యులు

స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్న గ్రామాలు

వలిగొండ : మండల వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 18 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యులు సుమన్‌కళ్యాణ్‌, కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వలిగొండ, వేములకొండ, వర్కట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 97 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా 18 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. కరోనా సోకిన వారిని హోం క్వారంటైన్‌ చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

రెండు రోజులు కరోనా పరీక్షలు నిలిపివేత..

వలిగొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందిలో ఒక్కరికి కరోనా పాజిటివ్‌ రావడంతో రెండు రోజలు కరోనా పరీక్షలు నిలిపివేస్తున్నట్లు మండల వైద్యాధికారి కిరణ్‌కుమార్‌ తెలిపారు. గురువారం, శుక్రవారం ఆరోగ్య కేంద్రాన్ని శానిటైజేషన్‌ చేస్తున్నందున రెండు రోజులు కరోనా ర్యాపిడ్‌ పరీక్షలను నిలిపి వేస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

బీబీనగర్‌లో 9 మందికి..

బీబీనగర్‌ : మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 70 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

భూదాన్‌పోచంపల్లిలో ఆరుగురికి..

భూదాన్‌పోచంపల్లి : మండలంలోని నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి యాదగిరి తెలిపారు.

భువనగిరిలో 11 మందికి..

భువనగిరి అర్బన్‌ : పట్టణంలోని 8వ వార్డులో 94 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి మురళిమోహన్‌ తెలిపారు.

తుర్కపల్లిలో ఒకరికి..

తుర్కపల్లి : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 15 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి చంద్రారెడ్డి తెలిపారు.

యాదగిరిగుట్టలో ఏడుగురికి..

ఆలేరు : యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 48 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వివిధ గ్రామాలకు చెందిన ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి వంశీకృష్ణ తెలిపారు.

ఆలేరులో నలుగురికి..

ఆలేరు రూరల్‌ : మండలంలోని శారాజీపేట పీహెచ్‌సీ ఆధ్వర్యంలో కొలనుపాకలో 54 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు పీహెచ్‌సీ వైద్యాధికారి రాజేందర్‌నాయక్‌ తెలిపారు.

మోటకొండూర్‌ ఆరుగురికి..

మోటకొండూర్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 22 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి రాజేందర్‌నాయక్‌ తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో మండల కేంద్రానికి చెందిన నలుగురు, ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఒకరు, ఆలేరు మండలానికి చెందిన ఒకరు ఉన్నారన్నారు.ఆత్మకూరు(ఎం)లో ఆరుగురికి..

ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు మండలంలోని మొరిపిరాలలో వివిధ గ్రామాలకు చెందిన 78 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి ప్రణీష తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారిని హోంక్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు. 

గుండాలలో ఏడుగురికి..

గుండాల : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 33 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి శ్రీనివాస్‌ తెలిపారు. పాచిల్లలో 4, అంబాలలో 2, పెద్దపడిశాలలో ఒకరికి కరోనా వచ్చినట్లు తెలిపారు.

బొమ్మలరామారంలో ముగ్గురికి..

బొమ్మలరామారం : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 20 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి శ్రవణ్‌కుమార్‌ తెలిపారు.

అడ్డగూడూరులో ఇద్దరికి..

అడ్డగూడూరు : మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 20 మందికి కరోనా పరీక్షలు చేయగా అడ్డగూడూరులో ఒకరు, చౌళ్లరామారంలో ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి నరేశ్‌ తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారికి ఐసొలేషన్‌ కిట్లు అందజేసి హోం క్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు.

రామన్నపేటలో 9మందికి..

రామన్నపేట : మండలంలో 9 మందికి కరోనా సోకినట్లు మండల వైద్యాదికారి రవికుమార్‌ తెలిపారు. మండలంలోని వెల్లంకిలో క్యాంపు నిర్వహించి కరోనా పరీక్షలు చేశారు. దీంతో వెల్లంకిలో ఐదుగురు, రామన్నపేట, కొమ్మాయిగూడెం, సిరిపురం, సూరారం గ్రామాల్లో ఒక్కొక్కరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. కరోనా సోకిన వారికి హోం ఐసొలేషన్‌ కిట్లు అందజేసి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

మోత్కూరులో ఇద్దరికి..

మోత్కూరు : మండలంలోని పీహెచ్‌సీలో 19 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి ఆకవరం చైతన్యకుమార్‌ తెలిపారు. పాజిటివ్‌ వచ్చినవారిని హోం క్వారంటైన్‌ చేసి మెడికల్‌కిట్లు అందజేసినట్లు తెలిపారు.


జిల్లాలో 

నిలకడగా కరోనా..

భువనగిరి కలెక్టరేట్‌ : జిల్లాలో ప్రస్తుతం కరోనా ఉధృతి నిలకడగా ఉన్నదని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ తెలిపారు. బుధవారం డీఎంహెచ్‌వోతో గూగుల్‌ మీట్‌ కార్యక్రమం ద్వారా పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వారం రోజుల నుంచి కరోనా కేసులు జిల్లాలో నిలకడగా ఉంటున్నాయన్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులను త్వరితగతిన గుర్తించి, వారి కాంటాక్టులను వెంటనే గుర్తించడం ద్వారా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. టెస్టుల సంఖ్య సైతం తగ్గకుండా ఎప్పటికప్పుడు ఇలానే కొనసాగించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో సాంబశివరావు పాల్గొన్నారు.


VIDEOS

logo