శనివారం 06 మార్చి 2021
Yadadri - Sep 27, 2020 , 01:45:14

మంత్రి ఈటలకు ఆశ కార్యకర్తల వినతి

మంత్రి ఈటలకు ఆశ కార్యకర్తల వినతి

భువనగిరి : ఆశ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశ కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశ కార్యకర్తలు మాట్లాడుతూ.. ఆశ కార్యకర్తలకు కనీస వేతనం నెలకు రూ.15000 ఇవ్వాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, అర్హులైన ఆశ కార్యకర్తలకు ఏఎన్‌ఎంలుగా పదోన్నతులు కల్పించాలన్నారు. అదేవిధంగా ఆశకార్యకర్తలకు స్మార్ట్‌ ఫోన్లతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఆశ కార్యకర్తల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరుణ, రాష్ట్ర కార్యదర్శి రబీయాబేగం, ప్రధాన కార్యదర్శి రావుల సంతోష తదితరులు ఉన్నారు.VIDEOS

logo