శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 24, 2020 , 01:32:16

అన్నదాత ఆనందహేల

అన్నదాత ఆనందహేల

నూతన రెవెన్యూ చట్టంపై సంబురాలు 

ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీ ర్యాలీలు 

ఊరూరా కదిలిన రైతు ప్రగతి చక్రాలు  

ఆకట్టుకున్న సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీలు 

జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత 

ఆలేరు : కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. యాదగిరిగుట్ట, తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు పీఎస్‌సీఎస్‌ల ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో 6 మండలాలకు చెందిన 500 ట్రాక్టర్లు, 1000 మంది రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. తుర్కపల్లి నుంచి ట్రాక్టర్లు టెంపుల్‌ రింగురోడ్డు నుంచి, రాజాపేటతో ఆయా గ్రామాలకు చెందిన ట్రాక్టర్లు, ఆలేరు, మోటకొండూర్‌, ఆత్మకూరు(ఎం) మండలాలకు నుంచి వంగపల్లి మీదుగా యాదగిరిపల్లికి చేరుకున్నాయి. అక్కడి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి పాదాల నుంచి గుండ్లపల్లి ఫంక్షన్‌హాల్‌ వరకు సాగింది. పటాకులు, డప్పుచప్పుళ్ల నడుమ ర్యాలీ కొనసాగింది. జై కేసీఆర్‌.. జైజై కేసీఆర్‌.. రైతుపక్షపాతి కేసీఆర్‌.. నూతన రెవెన్యూ చట్టం భేష్‌ అంటూ ర్యాలీ నినాదాలతో మార్మోగింది. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పాల్గొని ట్రాక్టర్‌ను నడిపించడం విశేషం. యాదగిరిగుట్ట పట్టణ రోడ్లన్నీ ట్రాక్టర్లతో కిక్కిరిసిపోయాయి. ర్యాలీలో యాదగిరిగుట్ట, తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు, మోటకొండూర్‌, ఆత్మకూరు(ఎం) మండలాల పీఏసీఎస్‌ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతుబంధు సమితి సభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.  

ఆలేరు టౌన్‌లో...

ఆలేరు టౌన్‌ : సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా యాదగిరిగుట్టలో నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీలో ఆలేరు పట్టణం నుంచి పెద్దఎత్తున ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ మొగులగాని మల్లేశం, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ చింతకింది చంద్రకళ, చింతకింది మురహరి, గవ్వల నర్సింహులు, పంతం కృష్ణ, ఎండీ ఫయాజ్‌, నాగరాజు, శ్రవణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఆలేరు రూరల్‌లో... 

ఆలేరురూరల్‌ : నూతన రెవెన్యూ చట్టంతో రైతు భూమికి రక్షణ కల్పించిన రైతుబాంధవుడు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీకి మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. వారిలో పీఏసీఎస్‌ చైర్మన్‌ మొగులగాని మల్లేశ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు బక్క రాంప్రసాద్‌, సర్పంచ్‌లు ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి, బండ పద్మాపర్వతాలు, కేతావత్‌ సుజాతా వీరయ్యనాయక్‌, చెక్కిల్ల మాధవీరవీందర్‌గౌడ్‌, వడ్ల నవ్యశోభన్‌బాబు, కొటగిరి జయమ్మ, బైరపాక లక్ష్మీ, ఏసిరెడ్డి మహేందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ మామిడాల నర్సింహులు, పీఏసీఎస్‌ డైరెక్టర్లు గవ్వల నర్సింహులు, మల్లేశ్‌, భిక్షపతి, నాయకులు మామిడాల అంజయ్య, కిష్టయ్య, ఆంజనేయులు, శ్రీధర్‌ పాల్గొన్నారు.

బొమ్మలరామారంలో...

బొమ్మలరామారం : నూతన రెవెన్యూ చట్టాన్ని తెచ్చినందుకుగాను సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ.. యాదగిరిగుట్టలో నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీకి ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలం నుంచి రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోలగాని వెంకటేశ్‌గౌడ్‌, భువనగిరి మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ రామిడి రాంరెడ్డి, ఉప సర్పంచ్‌ భరత్‌, మాజీ సర్పంచ్‌ వడ్లకొండ ఆనంద్‌ పాల్గొన్నారు.

రాజాపేటలో...

రాజాపేట : నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ మండలంలోని పొట్టిమర్రి వద్ద ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం యాదగిరిగుట్టలో నిర్వహించిన ర్యాలీకి 120 ట్రాక్టర్లలతో తరలివెళ్లారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్‌, జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ కాయితి శ్రీనివాస్‌రెడ్డి, సీసీ బ్యాంక్‌ చైర్మన్‌ చింతలపూరి భాస్కర్‌రెడ్డి, మదర్‌డెయిరీ డైరెక్టర్లు వెంకట్‌రాంరెడ్డి, గాల్‌రెడ్డి, నాగరాజు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

తుర్కపల్లిలో... 

తుర్కపల్లి : సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని హర్షిస్తూ మండల కేంద్రం నుంచి యాదగిరిగుట్టకు  ట్రాక్టర్‌ ర్యాలీ తరలివెళ్లింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ట్రాక్టర్‌ ర్యాలీని టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా సుశీలా రవీందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సింగిరెడ్డి నరసింహారెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పలుగుల నవీన్‌కుమార్‌, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ కొమిరిశెట్టి నర్సింహులు, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యురాలు ఉమారాణి, నాయకులు పాల్గొన్నారు.

ఆత్మకూరు(ఎం)లో... 

ఆత్మకూరు(ఎం):  ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని అమలు చేయడాన్ని స్వాగతిస్తూ మండల కేంద్రంలో రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ట్రాక్టర్లలో భారీ ర్యాలీ నిర్వహించి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం యాదగిరిగుట్టలో నిర్వహించిన నియోజకవర్గం స్థాయి ట్రాక్టర్ల ర్యాలీ కోసం ఆత్మకూరు(ఎం) మండలం నుంచి 100 ట్రాక్టర్లు తరలివెళ్లాయి. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పలయ్య, వెంకటేశ్‌, రంగారెడ్డి, ఎంపీటీసీ యాస కవిత, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ యాస ఇంద్రారెడ్డి, జిల్లా డైరెక్టర్లు భిక్షపతి, ధనలక్ష్మి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు చందర్‌గౌడ్‌, భానుప్రకాశ్‌, పూర్ణచందర్‌రాజు, రైతు సమితి బంధు సమితి గ్రామ కోఆర్డినేటర్లు రాజు, స్వామి, వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకన్న, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు అరుణ, మల్లికార్జున్‌, విజయ్‌, సత్తయ్య, అబ్బసాయిలు, శ్రీహరి పాల్గొన్నారు.

మోటకొండూర్‌లో... 

మోటకొండూర్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడం రైతుల బాగు కోసమేనని మోటకొండూర్‌ జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నూతన రెవెన్యూ చట్టంపై రైతులు హర్షిస్తూ ప్రభుత్వ విప్‌ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి పిలుపు మేరకు భారీగా ట్రాక్టర్‌ ర్యాలీని నిర్వహించారు. మండల కేంద్రం నుంచి యాదగిరిగుట్టకు ర్యాలీగా బయలుదేరారు. జడ్పీటీసీ టీఆర్‌ఎస్‌ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ భూమండ్ల ఐలయ్య, వంగపల్లి పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఎగ్గిడి బాలయ్య, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ బురాన్‌, పార్టీ సీనియర్‌ నాయకులు పైళ్ల సత్యనారాయణరెడ్డి, సింగిరెడ్డి నర్సిరెడ్డి, మండల నాయకులు భూమండ్ల శ్రీనివాస్‌, సీస బాలరాజు, మహేశ్‌, వెంకటేశ్‌, నవీన్‌రెడ్డి, జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo