రామన్నపేట: రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీవో శాగంటి శైలజ తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ… ప్రాజెక్టు పరిధిలో ఒక మినీ అంగన్ వాడీ టీచర్, 14 ఆయా పోస్టుల ఖాళీగా ఉన్నాయని వివరాలను ఆమె తెలిపారు. వలిగొండ మండలం ఏదుళ్ల గూడెం చైతన్యపురిలో మిని అంగన్వాడీ టీచర్పోస్టు,( జనరల్) మిగతా ఆయా పోస్టులు రామన్నపేట మండలంలోని ఎన్నారం-1 (ఎస్సీ), వలిగొండ మండలం: వలిగొండ అంగన్వాడి కేంద్రం-4 (ఎస్సీ), వెల్వర్తి అంగన్వాడి కేంద్రం-2( బీసీ ఏ),
మొగిలిపాక (ఎస్టీ), పులిగిల్ల అంగనవాడీ కేంద్రం-1(ఎస్సీ), పులిగిల్ల అంగన్వాడీ కేంద్రం-2 (జనరల్), చౌటుప్పల్ మండలం: మసీదుగూడెం (జనరల్) చౌటుప్పల్ అంగన్వాడీ కేంద్రం-3 (జనరల్), ఎస్ లింగోటం అంగన్వాడీ కేంద్రం-2(ఎస్సీ), తంగెడపల్లి అంగన్వాడీ కేంద్రం-1( బీసీఏ), నేలపట్ల అంగన్వాడీ కేంద్రం-2 (జనరల్), పీపల్ పహడ్ అంగన్వాడీ కేంద్రం- 1(బీసీబీ), పంతంగి అంగన్వాడీ కేంద్రం-4(జనరల్) సంస్థాన్ నారయణపురం: సంస్థాన్ నారయణపురం అంగన్వాడీ కేంద్రం-3 (జనరల్) పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు.
పదోతరగతి ఉతీర్ణులై దరఖాస్తు తేదినాటికి 21నుంచి 35 సంవత్సరాల మధ్యవయస్సు కలిగి తప్పనిసరిగా వివహతురాలై స్థానికురాలై ఉండాలని తెలిపారు. ఈనెల 25లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈనెల 28వ తేదీలోగా రామన్నపేట ప్రాజెక్టు కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకోవాలని తెలిపారు.