సోమవారం 19 అక్టోబర్ 2020
Yadadri - Sep 27, 2020 , 01:45:18

కరెన్సీ నోటుపై అంబేద్కర్‌ ఫొటో ముద్రించాలి

కరెన్సీ నోటుపై అంబేద్కర్‌ ఫొటో ముద్రించాలి

గుండాల : కరెన్సీ నోటుపై భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఫొటో ముద్రించాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేరిపోతుల పరశురాం ఆధ్వర్యంలో శనివారం వెల్మజాల నుంచి హైదరాబాద్‌ ఆర్బీఐ వరకు మహా పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రను మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘనపూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్బీఐని రూపకల్పన చేసిన మహానీయుడు అంబేద్కర్‌ అన్నారు. ఆయన ఫొటోను కరెన్సీపైన ముద్రించాలని పరశురాం చేస్తున్న పోరాటం గొప్పదని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సంగి బాలకృష్ణ, ఎంపీటీసీ సంగి అలివేలు, మాజీ ఎంపీపీ సంగి వేణుగోపాల్‌యాదవ్‌, నాయకులు కచ్చిగళ్ల నాగరాజు, జేరిపోతుల ఆంజనేయులు, స్వామి, సురేశ్‌, నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

logo