మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Sep 09, 2020 , 01:02:57

రైతువేదిక నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

రైతువేదిక నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

పంచాయతీ రాజ్‌ డీఈ వెంకటేశ్వర్లు

మోటకొండూర్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతువేదికల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని పంచాయతీ రాజ్‌ డీఈ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు చందేపల్లి, చాడ, మాటూరు గ్రామాల్లో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను పంచాయతీరాజ్‌ ఏఈ తులసీకృష్ణ, మండల వ్యవసాయాధికారి సుబ్బూరి సుజాతతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో రైతువేదిక పనుల్లో సర్పంచులు అలసత్వం వ్యవహరించరాదని త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. దసరా పండుగలోపు ప్రతి గ్రామంలో రైతు వేదికలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రైతువేదికల నిర్మాణంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు వడ్డెబోయిన శ్రీలత, దూదిపాల మున్నీ, పోతిరెడ్డి స్వప్నాస్కైలాబ్‌రెడ్డి, మల్గ ఎట్టమ్మ, ఉప సర్పంచ్‌ రేగు శ్రీనివాస్‌, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.
VIDEOS

logo