e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home జిల్లాలు జోరు సాగనీ..

జోరు సాగనీ..

జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు
జోరుమీదున్న వానకాలం పంటల సాగు
రెండు నెలల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం
పెరిగిన 1.81 అడుగుల భూగర్భ జలాలు
ఉపయుక్తంగా 24గంటల కరెంటు.. పెట్టుబడి సాయం
ఇప్పటికే 1.20లక్షల ఎకరాల్లో వరి.. 1.53లక్షల ఎకరాల్లో పత్తి..
సాగు పనుల్లో రైతులు బిజీ బిజీ

యాదాద్రి భువనగిరి, జూలై 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. సీజన్‌కు ముందే అందుబాటులో ఉంచిన విత్తనాలు, ఎరువులు.. పెట్టుబడి సాయా నికితోడు 24గంటల కరెంటు రైతన్నలకు కొండంత భరోసాను కల్పించింది. ఈ ఏడాది జూన్‌ నుంచి రెండు నెలల వ్యవధిలో సాధారణ వర్షపాతానికి మించి వర్షం కురిసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే 1.20లక్షల ఎకరాల్లో నాట్లు పడగా.. మరో లక్ష ఎకరాల్లో నాటేందుకు నారుమడిని సిద్ధం చేసుకుని ఉంచారు. అలాగే 1.53లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలను విత్తే ప్రక్రియ పూర్తయ్యింది. ప్రభుత్వం సూచనల మేరకు సాగు పద్ధతులను అవలంభించేందుకు సిద్ధపడ్డ రైతులు కంది పంటకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వానకాలంలో జోరుమీదున్న పంటల సాగును చూసి పుడమి తల్లి పులకిస్తోంది.

జిల్లాలో గతంలో కంటే పరిస్థి తులు మెరుగుపడ్డాయి. ఒకప్పటి కరువు పరిస్థితులు క్రమక్రమంగా తొలగిపోతున్నాయి. రైతు ల్లో వచ్చిన చైతన్యం ఫలితంగా నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలనే ఎక్కువగా సాగు చేస్తు న్నారు. దీనికితోడు మిషన్‌ కాకతీయ పథకంలో చెరువుల పునరుద్ధ్దరణ.. 24 గంటల విద్యుత్‌ సరఫరా..పెట్టుబడి సాయం వంటి పథకాలు పం టల సాగులో రైతులకు తోడ్పాటునందిస్తు న్నా యి. ఈ క్రమంలో ప్రతి సీజన్‌లోనూ ఊహించని రీతిలో పంటలు సాగవుతున్నాయి. ఈసారి వానకాలంలో వరికి సంబంధించి సన్న, దొడ్డు రకం పంటల సాగు 1,30,455 ఎకరాల్లో సాగవు తుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. ఇప్పటివరకు 1.20 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. మరో లక్ష ఎకరాల్లో నాటేందుకు నారుమడి సిద్ధంగా ఉంది. దీన్నిబట్టి ఈసారి రె ట్టింపు స్థాయిలో వరి సాగు అవనున్నది. అలాగే పత్తి 1,74,023 ఎకరాల్లో సాగవ్వనుండగా ఇప్పటికే 1.53 లక్షల ఎకరాల్లో విత్తనాలను విత్తడం పూర్తయ్యింది. 29,934 ఎకరాల్లో కంది సాగుకు రైతులు ఉపక్రమించారు. వ్యవసాయ శాఖ అంచనాలకు అనుగుణంగా జొన్న 441 ఎకరాల్లో, పెసర్లు 139 ఎకరాల్లో విత్తనాలను విత్తడం కూ డా పూర్తయ్యింది. మరో 1,765 ఎకరాల్లో పశుగ్రాసం, కూరగాయల సాగును చేపట్టారు. మిగిలిన ఎకరాల్లోనూ పంటల సాగుకు రైతులు సన్నద్ధ్దమవుతున్నారు.

- Advertisement -

అనుకూలించిన వాతావరణం..
వర్షాకాలంలో పంటల సాగు ఆశలతో కూడుకున్నది. వర్షం పడితేనే విత్తనం వేసే రైతుకు ప్రస్తు తం అనుకూలమైన వాతావరణం ఉంది. జూన్‌ 1వ తేదీ నుంచి జూలై 22వ తేదీ వరకు 213.9
మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. ఇప్పటివరకు 419.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైం ది. రెండు నెలల కాలంలోనే 96శాతం అధికంగా వర్షం కురిసింది. గతేడాది పాతాళానికి పడిపోయి న భూగర్భజలాలు అనూహ్యంగా పెరిగాయి. ఏకంగా 1.81 అడుగుల పైకి నీరు ఉబికి రాగా ఒకటి, రెండు మండలాలు మినహా మిగతా అన్నిచోట్లా భూగర్భజలాలు ఆశించినస్థాయిలో అం దుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే విత్తిన పంట ల్లో 50 శాతం మొలక దశను చేరుకోవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతున్నది. ఎప్పుడు విత్తనాలు వేసినా మొగులు వైపు చూసే రైతన్నకు ఈసారి ఆ పరిస్థితి రాకుండానే వరుసగా జల్లులు కురుస్తుండటంతో రైతు ముఖంలో నవ్వులు పూ స్తున్నాయి. అక్కడక్కడా మొలకెత్తిన పంటలో ఇప్పటికే కలుపు సైతం తీస్తున్నారు. విత్తనం మొలకెత్తని రైతులు మరోసారి విత్తనం వేసే పనిలో నిమగ్నమయ్యారు.

వరి సాగువైపే రైతన్నల మొగ్గు..
జిల్లాలో మూసీనది, గోదావరి జలాలు సమృద్ధ్ది గా ఉండటంతో రైతులు ఎంతో ఉత్సాహంగా పం టల సాగుకు ఉపక్రమించారు. అయితే రైతులు మూసీనది పరీవాహక ప్రాంతం వెంట వరినే సా గు చేస్తుండటంతో జిల్లాలో అత్యధికంగా వరి పం టనే సాగుకానుంది. వరిలో కూడా సన్న రకం పంటలను తగ్గించి దొడ్డు రకం సాగుకు ప్రాధాన్యమివ్వాలన్న అధికారుల సూచనలు మేరకు అత్యధిక విస్తీర్ణంలో దొడ్డు రకం సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో 89వేల ఎకరాల్లో సన్న రకం సాగు కానుండగా.. 1.15 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం పంటలు సాగవ్వను న్నాయి. మరోపక్క రైతులు పత్తిపంటకు కూడా అధిక ప్రాధాన్యమిచ్చి ముందుకు సాగుతున్నా రు. గతేడాది పత్తిపంటకు మద్దతు ధర కల్పించడంతోపాటు ప్రభుత్వమే సీసీఐ ద్వారా కొనుగోళ్లు జరపడంతో ఆశించిన ధర పొందిన రైతులు ఈసారి పత్తి పంటవైపు కూడా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో 1.74 లక్షల ఎకరాలకుగానూ ఇప్పటికే 1.53లక్షల ఎకరాల్లో పత్తి పంటల సాగు పూర్తయ్యింది.

నిండుకుండల్లా చెరువులు..
జిల్లాలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. నిండుకుండల్లా కనిపిస్తున్న చెరువులు రైతుల్లో ఆశలను రేకెత్తిస్తున్నాయి. వానకాలం సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి వర్షాలు సమృద్ధ్దిగానే కురుస్తున్నాయి. ఈ క్రమంలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలకు మరింతగా మేలు చేస్తున్నాయి. అటు గోదావరి జలాలు, ఇటు మూసీనది పరవళ్లకు వర్షం నీరు తోడై అన్ని చెరువులు జలకళను సం తరించుకున్నాయి. జిల్లాలో 1,005 చెరువులు ఉండగా.. 135 చెరువుల్లోకి సమృద్ధిగా నీరు చేరడంతో అలుగు పోస్తున్నాయి. మరో 167 చెరువుల్లో నీటి మట్టం పూర్తిస్థాయికి చేరింది. 212 చెరువుల్లో 25 శాతం లోపు గా నీరు చేరితే, 268 చెరువుల్లోకి 50 శాతం, 223 చెరువుల్లోకి 75 శాతం మేర వర్షం నీరు వచ్చి చేరింది. వాగుల్లో నిర్మించిన చెక్‌ డ్యాంలలోనూ పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana