e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home జిల్లాలు గుట్టలో ఏసీబీ కలకలం

గుట్టలో ఏసీబీ కలకలం

ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు లంచం డిమాండ్‌
రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టివేత
మధ్యవర్తి, సబ్‌ రిజిస్ట్రార్‌ అరెస్టు
హైదరాబాద్‌లో సబ్‌ రిజిస్ట్రార్‌ ఇంట్లోనూ కొనసాగుతున్న దాడులు

యాదాది, జూలై 29: ఓ వెంచర్‌ నిర్వాహకుడి నుంచి లంచం తీసుకుంటున్న యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ గాజుల దేవానంద్‌ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వెంచర్‌లో విక్రయించిన ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు రూ. 20,000 డిమాండ్‌ చేయ డంతో సదరు వెంచర్‌ నిర్వాహకుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు గురువారం యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల యంలో సదరు వెంచర్‌ నిర్వాహకుడి మధ్యవర్తి అసిస్టెంట్‌ డా క్యుమెంట్‌ రైటర్‌కి డబ్బులు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టు కున్నారు. దీంతో మధ్యవర్తిని, లంచం డిమాండ్‌ చేసిన సబ్‌ రి జిస్ట్రార్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ దాడులు చేశారన్న విషయంతో యాదాద్రి ఒక్కసారి ఉలిక్కిపడింది.

5 ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ విషయమై..
హైదరాబాద్‌ యాప్రాల్‌కు చెందిన డాక్టర్‌ సత్యం మడే అనే వ్యక్తి 2008లో ఆలేరు మండలం కొలనుపాక గ్రామపంచా యతీ పరిధిలో స్విస్‌ లైప్‌ గ్రీన్‌ ఎవెన్యూ టౌన్‌ షిప్‌ ప్రైవేట్‌ లి మిటెడ్‌ అనే పేరుతో వెంచర్‌ చేసి, ఫ్లాట్లను విక్రయిస్తూ వ్యాపా రం సాగిస్తున్నాడు. వెంచర్‌లో కొన్ని ఫ్లాట్లు మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో 5ఫ్లాట్లను విక్రయించేందుకు డాక్యుమెంట్లతో యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ గాజుల దేవానంద్‌ను కలిశాడు. డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ చేయాలని జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌తో కూ డా ఫోన్‌లో మాట్లాడించాడు. కాగా రెండు డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసిన సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌, మిగతా 3 డాక్యుమెంట్లను పక్కన పెట్టాడు. వెంచర్‌ నిర్వాహకుడు తనకు తెలిసిన వారితో రెండు మూడు సార్లు చెప్పించుకుని, కార్యాల యానికి వెళ్లి సబ్‌ రిజిస్ట్రార్‌ను కలిసినా పట్టించుకోలేదు. ఇత రుల ద్వారా అసలు విషయం తెలుసుకున్న వెంచర్‌ నిర్వాహ కుడు కార్యాలయం కిందనే ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ మధ్యవర్తి ప్రి న్స్‌ డాక్యుమెంట్‌ రైటర్‌ కార్యాలయంలోని అసిస్టెంట్‌ డాక్యు మెంట్‌ రైటర్‌ ప్రభాకర్‌ను కలువగా ఒక్కో డాక్యుమెంట్‌కు రూ. 8,000 చొప్పున, మూడింటికి రూ.24,000 డిమాండ్‌ చేయ గా చివరకు రూ. 20,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

- Advertisement -

పట్టుకున్నారిలా..
మూడు ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు గాను ఒప్పందం ప్రకా రం రూ. 20 వేలు అసిస్టెంట్‌ డాక్యుమెంట్‌ ప్రభాకర్‌కు ఇవ్వా ల్సిందిగా సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌ తెలిపాడు. వెంటనే వెంచర్‌ నిర్వహకుడు డాక్టర్‌ సత్యం మడే ఏసీబీకి ఫిర్యాదు చేయగా, అధికారులు బాధితుడితో కలిసి గురువారం మధ్యాహ్నం 3. 20గం నేరుగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంకు వచ్చారు. సబ్‌ రిజిస్ట్రార్‌కు డబ్బులు ఇచ్చేందుకు వెళ్లగా అసిస్టెంట్‌ డాక్యుమెం ట్‌ రైటర్‌ ప్రభాకర్‌కు డబ్బులు అందజేయాలని సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌ తెలుపడంతో బాధితుడు కిందకు వెళ్లి ప్రభాకర్‌కు రూ.20,000 అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాం డెడ్‌గా పట్టుకున్నారు. ప్రభాకర్‌తో పాటు సబ్‌ రిజిస్ట్రార్‌ దేవా నంద్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి హైదాబాద్‌ ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు మ హబూబ్‌నగర్‌ ఏసీబీ డీఎస్పీ, నల్లగొండ ఇన్‌చార్జి శ్రీకృష్ణగౌడ్‌ తెలిపారు.ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే వెం టనే 1064 నంబర్‌కు సంప్రదించాలన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ దాడిలో నల్లగొండ ఏసీబీ సీఐలు వెంకట్రావ్‌, రామారావు, మెదక్‌ డీ ఎస్పీ ఆనంద్‌, మహబూబ్‌నగర్‌ సీఐలు లింగస్వామి, నర్సిం హా, మెదక్‌ ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ ఇంట్లోనూ సోదాలు
ఏసీబీకి చిక్కిన యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ గాజుల దేవా నంద్‌ ఇంట్లో సైతం ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. హైదరాబాద్‌లోని మేడిపల్లిలో ఆయన స్వగృహంలో అధికారు లు విస్తృత స్థాయిలో సోదాలు చేపట్టి రూ. 20 లక్షల నగదు, పలు విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

2019లో రెండు రోజులు దాడులు
భూములు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో అవకతవకలు జరుగుతు న్నాయన్న పక్కా సమాచారంలో 2019 మే 30వ తేదీన అ ప్పటి ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఇద్దరు డీ ఎస్పీలు, ఆరుగురు సీఐలు, 15 మంది అధికారులతో యాదగి రిగుట్ట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. 30వ తేదీ సాయంత్రం 5గంటలకు మొదలైన తనిఖీలు రెండు రోజులు పాటు సాగాయి. ఈ దాడిలో భూముల రిజిస్ట్రేషన్‌ వాల్యూ కంటే ఎక్కువ డబ్బులు వసూలుతో పాటు, కార్యాల యంలో ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ప్రైవేట్‌ వ్యక్తులతో పని చేపిస్తూ సబ్‌ రిజిస్ట్రార్‌ నిబంధనలు ఉల్లంఘించారని అప్పటి సబ్‌ రిజిస్ట్రార్‌ వాహిద్‌ఖాన్‌ను తప్పించి, తాజాగా పట్టుబడ్డ దే వానంద్‌ను ఇన్‌చార్జీగా నియమించగా కొన్ని నెలల తరువాత పూర్తి బాధ్యతలతో సబ్‌ రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్నాడు.

రిజిస్ట్రేషన్‌ చేయమంటే డబ్బులు డిమాండ్‌ చేశాడు
కొలనుపాక గ్రామ పంచాయతీ లే అవుట్‌లో సర్వే నంబర్‌ 424, 42 5, 426, 440 సర్వే నంబర్లలో 23.29 గుంటలతో వెంచర్‌ ప్రారంభించాను. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అనుమ తులు కూడా తీసుకున్నాను. దాదాపు ఫ్లాట్ల కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. లాక్‌డౌన్‌ అనంత రం 5ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్లు చేయాలని యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ వద్దకు వచ్చాను. ఒక్కో ఫ్లాటుకు రూ. 10,000 లంచం డిమాండ్‌ చేశాడు. తెలిసిన వ్య క్తులతోపాటు జిల్లా రిజిస్ట్రార్‌తో ఫోన్‌ చేయిస్తే 2 డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్‌ చేసి, మిగతా 3డాక్యుమెంట్లను నిలిపివేశా డు. వివరణ కోరగా గ్రామ పంచాయతీ లే అవుట్‌ కావడంతో రిజిస్ట్రేషన్‌ చేయనని తెలిపాడు. 2008లోనే వెంచర్‌కు సం బంధించిన అనుమతుల నిమిత్తం ప్రభుత్వ రుసుములు చెల్లించాం. ఇందుకు సంబంధించిన పత్రాలను సైతం డీపీవోకు సమ ర్పించాం. చివరకు సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌ రూ. 20 వేలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. నేరుగా ఇవ్వకుండా మధ్య వర్తి అసిస్టెంట్‌ డాక్యూమెంట్‌ రైటర్‌ ప్రభాకర్‌కు అందజేయాలని తెలిపాడు. దీంతో ఏసీబీకి పిర్యాదు చేశాను.
-డాక్టర్‌ సత్యం మడే, బాధితుడు, చైర్మన్‌, స్విస్‌లైప్‌ గ్రీన్‌ ఎవెన్యూ టౌన్‌ షిప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana