e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home జిల్లాలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలు
సీఎం కేసీఆర్‌ సంకల్పంతోనే ఫ్లోరోసిస్‌ విముక్తి
విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
మునుగోడు నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఆహారభద్రత కార్డులు పంపిణీ

మునుగోడు, జూలై 28: రాజకీయాలకు అతీతంగా రాష్ర్టాన్ని అభివృద్ధి చెయడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్ని కలొచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు మాట్లాడడం తప్ప, రాజకీయాలకు అతీతంగా అందరిని భాగస్వాములను చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 2014కు పూర్వం ఆరు దశాబ్దాలుగా అభివృద్ధి జ రుగలేదని, సాగునీరు, తాగునీరు కొరతతో వ్యవసాయ రంగం అభివృద్ధి కుంటు పడిందని చెప్పారు. బుధవారం మునుగోడు లో మునుగోడు, చండూరు మండలాల వివిధ గ్రామాల లబ్ధిదా రులకు కొత్తగా మంజూరు చేసిన ఆహార భద్రత కార్డులను ఆయ న లబ్ధిదారులకు అందజేశారు.

మునుగోడు మండలం 423 మంది, చండూరు మండలంలో 352 మంది లబ్ధిదారులకు మంత్రి నూతన ఆహార భద్రత కార్డులు పంపిణీ చేశారు. మును గోడు నియోజకవర్గంలో 2038 నూతన ఆహార భద్రత కార్డులు మంజూరు చేసి అర్హులైన వారికి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడో ఒక కుగ్రామంలో పురుడు పోసుకున్న ఫ్లోరోసి స్‌ అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి నల్లగొండ జిల్లాను కబళిం చిందన్నారు. అటు వంటి ఫ్లోరోసిస్‌ను నిలువరించేందుకు ము నుగోడు నియోజకవర్గంలోనే బృహత్తర మిషన్‌ భగీరథ పథకా నికి శ్రీకారం చుట్టి కృష్ణా, గోదావరి నదుల నుంచి సురక్షితమైన తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ఆయ న కొనియాడారు. ఇది ప్రభుత్వంగా మేము చెబుతున్న మాట లు కాదని, లోక్‌సభలో బీజేపీకి చెందిన కేంద్ర జలశక్తి ఛైర్మన్‌ చెప్పిన మాటలు అని మంత్రి జగదీశ్‌రెడ్డి ఉటంకించారు. ప్రజల ఆకాంక్షలే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎజెండా అని చెప్పేందుకు ఈ ఒక్క పథకం సరిపోతుందని ఆయన అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల వద్ద నిర్మిస్తున్న యాదాద్రి పవర్‌ ప్లాంట్‌, మునుగోడు నియోజకవర్గ పరిధి మల్కాపురం వద్ద నిర్మిస్తున్న ఇండస్ట్రీయల్‌ పార్క్‌లు ప్రభుత్వం అభివృద్ధికి దిక్సూచీలుగా నిలబడ్డాయన్నారు. ధాన్యం సేకరణలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు.

- Advertisement -

ప్రజాప్రతినిధుల విన్నపాలకు స్పందించిన మంత్రి
నియోజకవర్గ కేంద్రమైన మునుగోడులో ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహం ఏర్పాటు చేయాలని, నల్లగొండకు తరలివెళ్లిన గురుకుల పాఠశాలలను మునుగోడుకు తరలించాలని జడ్పీటీసీ నారబో యిన స్వరూపారాణి, స్థానిక సర్పంచ్‌ మిర్యాల వెంకన్న మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాటు పలివెల ఫీడర్‌ఛానల్‌, వరద కాల్వలో పూడిక తీసి మునుగోడు పెద్ద చెరువు నిండేలా చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. వెంటనే స్పందించిన మంత్రి జగదీశ్‌ రెడ్డి.. నీటిపారుదల, రెవెన్యూశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవి ధంగా పెండింగ్‌లో ఉన్న శేషిలేటివాగు, వెల్మకన్నె ఫీడర్‌ ఛానళ్ల నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం మంత్రిని ఈ సందర్భంగా కోరారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ప్ర జాప్రతినిధులు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలి కారు.

అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి పర్య టన సందర్భంగా డీఐజీ రంగనాథ్‌ బందోబస్తును పర్యవేక్షించా రు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ట్రైనీ కలెక్టర్‌ అపూర్వ్‌ చౌహాన్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంక టేశ్వర్లు, డీఎం నాగేశ్వరరావు, డీపీఆర్‌వో శ్రీనివాస్‌, ఎంపీపీలు కర్నాటి స్వామి, గుత్తా ఉమాదేవి, తాడూరి వెంకట్‌రెడ్డి, జడ్పీటీ సీలు నారబోయిన స్వరూపారాణి, కర్నాటి వెంకటేశం, వీరమళ్ల భానుమతి, పాశం సురేందర్‌రెడ్డి, చౌటుప్పల్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి, తాసీ ల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో యాకూబ్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana