e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home జిల్లాలు ఊరూరా పండుగలా..

ఊరూరా పండుగలా..

కొనసాగుతున్న రేషన్‌ కార్డుల పంపిణీ
బీబీనగర్‌లో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
అడ్డగూడూరు, మోత్కూరులో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌, రామన్నపేటలో ఎమ్మెల్యే లింగయ్య
కొత్త కార్డుదారులకు ఆగస్టు నుంచి అందనున్న రేషన్‌
లబ్ధిదారుల ముఖాల్లో విరబూసిన సంతోషం

యాదాద్రి భువనగిరి , జూలై 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ జిల్లాలో కొనసాగుతున్నది. బుధవారం బీబీనగర్‌లోని ఫేమస్‌ఫంక్షన్‌హాల్‌లో ఆహార భద్రత కార్డుల పంపిణీని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డితో కలిసి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రారంభించారు. అడ్డగూడూరు, మోత్కూరులో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌, రామన్నపేటలో నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు రేషన్‌కార్డుల మంజూరుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆహార భద్రత కార్డులను బుధవారం మోత్కూరు మండల కేంద్రంలోని ఎల్‌ఎన్‌ ఫంక్షన్‌హాల్‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ప్రతి పేద కుటుంబానికి మూడు పూటల భోజనం అందించేందుకు రాష్ట్రంలో 3.60లక్షల కుటుంబాలకు నూతనంగా ఆహార భద్రత కార్డులను మంజూరు చేశారన్నారు. ఈ కార్డుల ద్వారా ప్రజా పంపిణీలో సబ్సిడీ బియ్యంతోపాటు ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తినప్పుడు ఆరోగ్యశ్రీ వంటి పథకం ఎంతో ప్రయోజనం ఉందన్నారు. మోత్కూరు మండలంలో 29,642 మంది జనాభా ఉంటే ఇప్పటికే 28,062 మంది కుటుంబాలకు ఆహార భద్రత కార్డులను పొంది ఉన్నారని, ఇప్పుడు మరో 274 మంది కుటుంబాలకు నూతనంగా కార్డులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలో ఇటీవల మంజూరైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్‌రెడ్డి, ఎంపీపీ సంధ్యారాణి, వైస్‌ ఎంపీపీ బుషిపాక లక్ష్మి, రైతు సహకార సంఘం చైర్మన్‌ కంచర్ల అశోక్‌రెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు కొండ సోంమల్లు, డీఎస్‌వో బ్రహ్మరావు, డీఎం గోపి, తహసీల్దార్‌ షేక్‌ అహ్మద్‌, ఆర్‌ఐ గాలయ్య పాల్గొన్నారు.

- Advertisement -

అడ్డగూడూరులో…
అడ్డగూడూరు, జూలై 28 : పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం 269 మందికి రేషన్‌కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాణలో అమలు చేసి ఆదర్శంగా నిలించిందన్నారు. నూతనంగా ఏర్పడిన కొండంపేట గ్రామపంచాయతీకి నూతన రేషన్‌ షాపును మంజూరు చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. మరికొంత మందికి కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసేందుకు అవకాశమివ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరగా, సానుకూలంగా స్పందించారని తెలిపారు. అర్హత కలిగిన ప్రతిఒక్కరికి రేషన్‌ కార్డులను ప్రభుత్వం అందజేస్తుందన్నారు.

హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి
హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. మండల కే్రందంలోని కల్లుగీత సహకార సంఘం భూమిలో ఆబ్కారీశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ 200 ఖర్జూర మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు.

కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతిఅయోధ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ పొన్నాల వెంకటేశ్వర్లు, వైస్‌ ఎంపీపీ దైద పురుషోత్తంరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ తీపిరెడ్డి మేఘారెడ్డి, జిల్లా కోఆప్షన్‌ మెంబర్‌ గుండిగ జోసఫ్‌, డీవోఎస్‌ బ్రహ్మచారి, డీఎం గోపి, తహసీల్దార్‌ రామకృష్ణ, ఆబ్కారీ శాఖ సీఐ చంద్రశేఖర్‌, ఎస్త్సెలు రాంబాబు, జ్యోతిరెడ్డి, సర్పంచ్‌ బాలెంల త్రివేణి, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి సత్యంగౌడ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చిప్పలపల్లి మహేంద్రనాథ్‌, నాయకులు శ్రీరాముల అయోధ్య, పూలపల్లి జనార్దన్‌రెడ్డి, జక్కుల యాదగిరి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana