e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home జిల్లాలు డాకుతండాకు ఢోకాలేదు

డాకుతండాకు ఢోకాలేదు

డాకుతండాకు ఢోకాలేదు

పల్లెప్రగతితో మారిన తండా రుపురేఖలు
అభివృద్ధి పథంలో మారుమూల గిరిజన తండా
మిషన్‌ భగీరథతో తీరిన ఏండ్లనాటి నీళ్ల గోస
సకల సౌకర్యాలతో వైకుంఠధామం, డంపింగ్‌యార్డు పూర్తి
నాడు ఆవాసం తండా.. నేడు కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు
కలిసికట్టుగా తండాను అభివృద్ధి చేసుకుంటున్న తండావాసులు
సొంత నిధులు ఖర్చు పెట్టి తండాను అభివృద్ధి చేస్తున్న సర్పంచ్‌

సంస్థాన్‌నారాయణపురం, జూలై 21 : ఒకప్పుడు అది మారుమూలు గిరిజన తండా. మండల కేంద్రానికి దూరంగా.. అభివృద్ధికి ఆమడ దూరంలో చిల్లాపురం గ్రామ పంచాయతీకి ఆవాస గ్రామంగా ఉంది. కంకర తేలిన రోడ్లు, చెత్తాచెదారంతో నిండిన పరిసరాలు..దసరా పండుగకు మాత్రమే వెలిగే వీధిలైట్లు ఆ తండాలో కనిపించేవి. గుక్కెడు నీళ్ల కోసం బావుల వెంట, చెల్మల వంట పరుగులు తీసిన రోజులు ఇంకా కండ్ల ముందే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం 2018లో డాకుతండాను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయడంతో తండా రూపురేఖలే మారిపోయాయి. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తూ సకల సౌకర్యాలతో వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, సీసీ రోడ్లు, ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, నర్సరీలో పదివేల మొక్కలు పెంచుతూ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామపంచాయతీ ట్రాక్టర్‌తో చెత్త సేకరిస్తుండటంతో పరిసరాలు పరిశుభ్రంగా ఉండటంతోపాటు హరితహారం మొక్కలతో వీధులన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.

ఒకప్పుడు అది మారుమూలు గిరిజన తండా. మండల కేంద్రానికి దూరంగా.. అభివృద్ధి అంటే అర్థం తెలియని మామూలు గిరిజనతండా. చిల్లాపురం గ్రామ పంచాయతీకు ఆవాస గ్రామంగా ఉండి అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. గతంలో కంకర తేలిన రోడ్లు, దసరాకు వీధిలైట్లు వేస్తే మళ్లీ దసరాకు వేసేవారు.. చెత్తాచెదారంతో పరిసరాలు కంపుకొట్టేవి. గుక్కెడు నీళ్ల కోసం బావుల వెంట చెల్మల వద్దకు పరుగులు తీసేవారు గిరిజనులు. అస్వస్థతకు గురైతే చావే శరణ్యం కానీ నేడు రాష్ట్ర ప్రభుత్వం 2018లో మారుమూల గిరిజన తండాలను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయడంతో ఐదు ఆవాస తండాలైన దుబ్బతండా, కోప్లతండా, కేలోతు తండా, బెల్లందోని తండాలను కలిపి డాకు తండాను నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయడంతో తండా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తూ ప్రతినెల వచ్చే నిధులను సక్రమంగా వినియోగిస్తూ గ్రామస్తుల సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ పెద్ద గ్రామ పంచాయతీలకు దీటుగా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది డాకుతండా. సకల సౌకర్యాలతో వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, సీసీ రోడ్లు, 104, 108 సేవలు, ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, నర్సరీలో పదివేల మొక్కలు పెంచుతూ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామపంచాయతీ కొనుగోలు చేసిన ట్రాక్టర్‌తో గ్రామంలో రోజుతప్పి రోజు చెత్త సేకరణ చేస్తుండటంతో పరిసరాలు పరిశుభ్రంగా కనువిందు చేస్తున్నాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో తండా మొత్తం పచ్చదనం పరుచుకుని వీధులన్నీ కళకళలాడుతున్నాయి.

- Advertisement -

మిషన్‌ భగీరథతో తీరిన నీటి కష్టాలు
గుక్కెడు నీళ్ల కోసం బావుల వెంట, బజారు నల్లాలు, చేతి పంపుల వద్ద గంటల తరబడి నిలపడే పరిస్థితి. ఎండాకాలం వస్తే బిందెడు నీళ్ల కోసం వారు పడిన బాధలు వర్ణరహితం. వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకుని బజారు నల్లాలకు కనెక్షన్లు ఇచ్చి నీళ్లను సరఫరా చేసేవారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకంతో భాగంగా తండాలో ఐదు ట్యాంక్‌లను నిర్మించారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇచ్చి ప్రతిరోజు రెండుసార్లు మిషన్‌ భగీరథ నీటిని అందిస్తున్నారుఅందిస్తున్నారు. మిషన్‌ భగీరథ పథకంతో ఇరువై ఏండ్ల నీళ్ల సమస్య తీరిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి ఇలా..
కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీ వచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకుని తండాను అభివృద్ధి చేసుకోవాలని గ్రామస్తులు, సర్పంచ్‌, పాలకవర్గ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఎత్తైన గుట్టను చదును చేసి రూ.12.50వేలతో వైకుంఠధామం సకల సౌకర్యాలతో నిర్మించారు. డంపింగ్‌ యార్డును రూ.2.50లతో పూర్తి చేసి సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. నర్సరీలో 10వేల మొక్కలను పెంచుతూ హరితహారానికి సిద్ధం చేశారు. గ్రామపంచాయతీ నిధుల నుంచి రూ.26 వేలతో తడి, పొడి చెత్త బుట్టలను కొనుగోలు చేసి ప్రతి ఇంటికీ రెండు బుట్టలను పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ రూ.9లక్షల 50వేలతో ట్రాక్టర్‌ కొనుగోలు చేసి చెత్త సేకరణ చేస్తుండటంతో వీధులన్నీ పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. పాడుబడిన బావులు, ఇండ్లను నేలమట్టం చేశారు. 95 శాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు ఏర్పాటు చేసుకొని గ్రామ పంచాయతీకు వచ్చిన నిధులను సక్రమంగా వినియోగిస్తూ అందరి సహకారంతో పెద్ద గ్రామపంచాయతీలకు దీటుగా తండాను అభివృద్ధి చేసుకుంటున్నారు.

అభివృద్ధిలో రాజీలేదు..
కొత్త గ్రామపంచాయతీకు మొదటి సర్పంచ్‌ కావడం అదృష్టంగా భావిస్తున్నా. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాం. అధికారుల సూచనలు, గ్రామస్తులందరి సహకారంతో గ్రామాభివృద్ధికి మంజూరు చేసిన నిధులను సక్రమంగా వినియోగిస్తూ గ్రామాభివృద్ధిలో రాజీపడకుండా పనులు చేస్తున్నాం. ప్రజలు మాపై నమ్మకంతో గెలిపించారు. 100 శాతం పన్నులు వసూలు చేస్తున్నాం. సొంతంగా రూ.లక్ష వరకు గ్రామాభివృద్ధికి ఖర్చు పెట్టాం
.- కరంటోతు జ్యోతి, సర్పంచ్‌, డాకుతండా

నీళ్ల గోస దూరమైంది..
గతంలో నీళ్ల కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్లం. వ్యవసాయ బోర్లు, చేతి పంపులు, చెల్మలా దగ్గరకు పోయి నీళ్లు తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు మిషన్‌ భగీరథ నీళ్లు రోజుకు రెండుసార్లు వస్తుండటంతో నీళ్ల గోస దూరమైంది. గతంలో దసరాకు వీధిలైట్లు వేస్తే మళ్లీ దసరాకు వేసేవారు. మా తండాను ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు 24 గంటల కరెంటు వస్తుంది. నీళ్ల గోస తీర్చిన సీఎం కేసీఆర్‌ సార్‌ జీవితాంతం రుణపడి ఉంటాం.

  • కరంటోతు బిచ్యా, తండావాసి

పల్లెప్రగతితోనే మార్పు..
పల్లె ప్రగతితో తండా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.ప్రభుత్వ పథకాలను సకాలంలో లబ్ధిదారులకు అందింస్తున్నాం.ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్రం చేస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం . హతహారం మొక్కలకు ప్రతి రోజు నీళ్లు పడుతున్నాం.ప్రజలు స్వచ్చందంగా పన్నులు చేలిస్తూ అభివృద్ధికి తోడ్పడుతున్నారు.

  • రంగ సునీత, పంచాయితీ కార్యదర్శి

గ్రామ పంచాయతీగా మారడం వల్లే..
ఇంతకు ముందు మా గ్రామం చిల్లాపురం కలిసి ఉండేది. చిన్న గ్రామాలను, తండాలను సీఎం కేసీఆర్‌ సారు గ్రామపంచాయతీగా మార్చడంతో మా నిధులు మాకు వస్తున్నాయి. దీంతో మా తండాలో వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు, సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలు ఏర్పాటు చేసుకున్నాం. గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ ప్రతిరోజూ చెత్త సేకరణ చేస్తుండటంతో విధులన్నీ పరిశుభ్రంగా ఉన్నాయి. సర్పంచ్‌, గ్రామస్తుల భాగస్వామ్యంతో తండాను అభివృద్ధి చేసుకుంటున్నాం.
-కరంటోతు లాలీ, ఉపసర్పంచ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
డాకుతండాకు ఢోకాలేదు
డాకుతండాకు ఢోకాలేదు
డాకుతండాకు ఢోకాలేదు

ట్రెండింగ్‌

Advertisement