బాలాలయంలో భక్తుల సందడి

- శ్రీవారి ఖజానాకు రూ. 9,80,741 ఆదాయం
యాదాద్రి, ఫిబ్రవరి20: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో శనివారం భక్తుల సందడి నెలకొన్నది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. కొండకింద గల వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కొండకింద గల కల్యాణకట్టతో పాటు కొండపైన గల ప్రసాద విక్రయకేంద్రాలు, స్వామివారిని దర్శించుకునే క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి బాలాలయంలో ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసిఅర్చనల వరకు నిత్య పూజలు అత్యంత వైభవంగా కొనసాగాయి. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు. అనంతరం దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు పంచనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ఆలయంలో దర్శనం అనంతరం అష్టోత్తర పూజలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన, పుష్కరిణి వద్ద కొలువై ఉన్న క్షేత్ర పాలక ఆంజనేయస్వామికి జరిగిన పూజల్లో భక్తులు పాల్గొన్నారు.
ఆదాయం రూ. 9,80,741
శ్రీవారి ఖజానాకు రూ. 9,80,741 ఆదాయంసమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 1,30,800, రూ. 100 దర్శనాల ద్వారా రూ. 26,7 00, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 31,800, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 1,800, సుప్రభాతం ద్వారా రూ. 800, క్యారీబ్యాగుల ద్వారా రూ. 5,080, ప్రచారశాఖద్వారా రూ. 595, సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారా రూ. 85,000, కల్యాణకట్ట ద్వారా రూ. 20,000, ప్రసాద విక్రయాల ద్వారా రూ. 4,29,800, శాశ్వతపూజల ద్వారా రూ. 30,0 00, వాహనపూజల ద్వారా రూ. 6,900, టోల్గేట్ ద్వారా రూ. 1,360, అన్నదాన విరాళం ద్వారా రూ. 10,79 4, సువర్ణపుష్పార్చన ద్వారా రూ. 88,860, యాదరుషి నిల యం ద్వారా రూ. 68,200, పుష్కరిణి ద్వారా రూ. 500, శివాలయం ద్వారా రూ. 900, పాతగుట్ట ద్వారా రూ. 16,525, ఇతర విభాగాలు రూ. 24,743తో కలిపి స్వామివారికి రూ. 9,80,741 ఆదాయం వచ్చిందన్నారు.
తాజావార్తలు
- ఎమ్మెల్సీ ప్రచారంలో దూసుకుపోతున్న సురభి వాణీదేవి
- కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ..