ఉద్యమంలా సభ్యత్వ నమోదు

- స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న ప్రజలు
- పాల్గొన్న ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు
యాదగిరిగుట్ట రూరల్, ఫిబ్రవరి 20: పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు గోపగాని ప్రసాద్‌గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని కంఠంగూడెంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించారు. ఒగ్గు మల్లేశ్, కంఠం విఠల్, కంఠం భాస్కర్ పాల్గొన్నారు.
చొల్లేరులో..
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని మహబూబ్‌పేట మాజీ సర్పంచ్ రంగారెడ్డి అన్నారు. మండలంలోని చొల్లేరులో ఆయన గ్రామస్థులకు టీఆర్ఎస్ సభ్యత్వాలు అందజేశారు. చొల్లేరు సర్పంచ్ బీరయ్య, మాజీ వైస్ ఎంపీపీ నర్సయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, దేవేందర్, భాస్కర్ పాల్గొన్నారు.
కొల్లూరులో ..
ఆలేరురూరల్, ఫిబ్రవరి 20: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి సభ్యత్వాలు నమోదు చేయించాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండలంలోని కొల్లూరులో ఆయన సభ్యత్వ నమోదు చేయించారు. మాజీ జడ్పీటీసీ పరమేశ్వర్, మాజీ వైస్ ఎంపీపీ కిష్టయ్య, టీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగం మండలాధ్యక్షులు కృష్ణ, భానుచందర్, నాయకులు జనగాం వెంకటపాపిరెడ్డి, కొటగిరి శ్రీధర్ పాల్గొన్నారు.
సభ్యత్వ నమోదు టార్గెట్ పూర్తిచేయాలి
మోటకొండూర్, ఫిబ్రవరి 20: మండలంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు టార్గెట్ పూర్తి చేయాలని జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, మండల ఇన్చార్జిలు పల్లెపాటి బాలయ్య, ప్రతికంఠం పూర్ణచందర్రాజ్, పార్టీ మండలాధ్యక్షుడు దూదిపాల రవీందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆయా గ్రామాల ఇన్చార్జిల నుంచి పూర్తయిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పుస్తకాలను తీసుకున్నారు. అనంతరం ఇన్చార్జిలతోపాటు సర్పంచ్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతు బంధుసమితి కన్వీనర్ అయిలయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బాలయ్య, పార్టీ సెక్రటరీ జనరల్ నర్సింగ్‌యాదవ్, ఎంపీటీసీ అంజిరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు బురాన్, పార్టీ యువజన విభాగం మండలాధ్యక్షుడు కృష్ణంరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జంగారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు మంత్రి రాజు, సీనియర్ నాయకులు సత్యనారాయణ, సుధీర్, అనంతరెడ్డి, నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.
బద్దుతండాలో..
తుర్కపల్లి, ఫిబ్రవరి 20: మండలంలోని బద్దుతండా, మోతీరాంతండా, మల్కాపురం గ్రామాల్లో టీఆర్ఎస్ సభ్యత్వాలు నమోదు చేయించారు. బద్దుతండా సర్పంచ్ గూగులోతు సురేశ్, బన్సీనాయక్ పాల్గొన్నారు.
సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి
బొమ్మలరామారం,ఫిబ్రవరి 20:ఇచ్చిన గడువులోగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని అల్డా చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి అన్నారు. మండలంలోని చీకటిమామిడిలో శనివారం అన్నిగ్రామాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల సమీక్షా సమావేశం పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్ అధ్వర్యంలో జరిగింది. సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గణేశ్, మండల నాయకులు మచ్చ శ్రీనివాస్‌గౌడ్, గొడుగు చంద్రమౌళి, బుడిద నవీన్‌గౌడ్, బీరప్ప, బండి మహేశ్‌గౌడ్, మైలారం నర్సింహ, జూపల్లి భరత్ పాల్గొన్నారు.
సభ్యత్వ నమోదుకు స్పందన
ఆత్మకూరు(ఎం), ఫిబ్రవరి 20: మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి స్పందన వస్తుందని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉప్పలయ్య అన్నారు.కాలువపల్లి, సింగారం, మోదుబావిగూడెం, లింగరాజుపల్లి గ్రామాల్లో చేపట్టిన సభ్యత్వ నమోదులో గ్రామ ఇన్చార్జిలు చందర్‌గౌడ్, రమేశ్‌గౌడ్, విజయ్‌కుమార్‌తో పాటు దయాకర్, శ్రీరాములు పాల్గొన్నారు.
జోరుగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
ఆలేరు టౌన్, ఫిబ్రవరి 20 : ఆలేరు పట్టణంలోని మొదటి వార్డు అధ్యక్షుడు సరాబు సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేపట్టారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మొరిగాడి వెంకటేశ్, ఆడెపు బాలస్వామి, బ్యూలా రాణి, రియాజ్, మల్లేశ్, శ్రీధర్, సుజాత, గోరెమియ్యా, సిద్ధిరాజు, మహ్మద్, శ్రీకాంత్, మోహన్, బాలరాజు, పాపయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు.
ఉద్యమంలా సభ్యత్వ నమోదు
రాజాపేట, ఫిబ్రవరి 20: ఆలేరు నియోజక వర్గంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పండుగలా కొనసాగుతుందని ఆపార్టీ సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి మోతే పిచ్చిరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.సమావేశంలో మండల పరిశీలకుడు గాదే బాల్నరసింహ, మండల ఇన్చార్జి సందిల భాస్కర్‌గౌడ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రమేశ్, మండల యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సంతోష్‌గౌడ్, మదర్ డెయిరీ డైరెక్టర్ గాల్‌రెడ్డి, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు ప్రవీణ్ పాల్గొన్నారు.
కొనసాగుతున్న సభ్యత్వ నమోదు
గుండాల, ఫిబ్రవరి 20: మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కొనసాగుతున్నది. శనివారం మండల వ్యాప్తంగా గ్రామాల ఇన్చార్జ్జిల ఆధ్వర్యంలో సభ్వ త్వాలను అందజేశారు. మండల పార్టీ అధ్యక్షుడు దశరథ, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ లక్ష్మీ, జడ్పీ కోఆప్షన్ సభ్యు డు ఎండీ.ఖలీల్, వైస్ ఎంపీపీ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఝరాసంగం కేజీబీవీలో కరోనా కలకలం
- బీపీసీఎల్ ఫర్ సేల్: నుమలీగఢ్ రిఫైనరీతో షురూ..!
- నెట్‌ఫ్లిక్స్ డీల్ కు నో..కారణం చెప్పిన నాగార్జున
- గల్వాన్‌లో మనపై దాడిచేసిన చైనా కమాండర్‌కు అత్యున్నత పదవి
- మోదీ స్టేడియంలో కోహ్లీసేన ప్రాక్టీస్: వీడియో
- ఆ టీ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు తెలుసా..!
- జన్నేపల్లి శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
- విద్యార్థులను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి
- ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్‌లోకి ఎస్బీఐ?.. అందుకే..!
- ‘బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడటమే మా ప్రాధాన్యత’