సోమవారం 01 మార్చి 2021
Yadadri - Feb 20, 2021 , 00:53:28

వైభవంగా అధ్యయనోత్సవాలు

వైభవంగా అధ్యయనోత్సవాలు

  • రెండో రోజూ ఉదయం తిరుమంజనం.. సాయంత్రం పురప్పాట్‌ సేవ
  • పెద్ద ఎత్తున పూజలు చేసి.. మొక్కులు చెల్లించుకున్న భక్తులు 
  • ఉదయం తిరుమంజనం
  • సాయంత్రం దివ్యప్రబంధ సేవ

భక్తులకు కల్పతరువుగా నిలుస్తున్న యాదాద్రి పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధ్యయనోత్సవాలు రెండోరోజూ వైభవంగా జరిగాయి.  శుక్రవారం ఉదయం స్వామివారి నిత్య ఆరాధనల అనంతరం తిరుమంజన మహోత్సవం నిర్వహించారు. సాయంకాలం నిత్యారాధనల అనంతరం పురప్పాట్‌ సేవను కనులపండువగా నిర్వహించారు. ప్రత్యేక రుత్వికులు, పండితులు శాస్ర్తోక్తంగా పాశురాలను పఠించారు. భక్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. 

 యాదాద్రి, ఫిబ్రవరి19: భక్తులకు కల్పతరువుగా నిలుస్తున్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి అధ్యయనోత్సవాలు రెండోరోజూ అంగరంగ వైభ వంగా జరిగాయి. శుక్రవారం ఉదయం స్వామివారి నిత్య ఆరాధనల అనం తరం తిరుమంజన మహోత్సవం పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం నిర్వ హించారు. సాయంత్రం ప్రబంధ పాశురాలను పఠిస్తూ పురప్పాట్‌ సేవను వైభవంగా నిర్వహించారు. స్వామివారి సేవను ఆలయంలో భాజా భజం త్రీలతో ఊరేగించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆళ్వారులు కీర్తించిన ప్రబంధాల్లోని పాశురాలను అనుసంధానం చేశారు. ప్రత్యేక రుత్వికులు, పండితులు సేవల ఎదుట శాస్ర్తోక్తంగా పాశురాలను పఠించారు. వేడుకల్లో ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నర సింహామూర్తి, పాతగుట్ట ఆలయ ప్రధానార్చకుడు మాధవాచార్యులు, ఉప ప్రధానార్చ కుడు సంపతాచార్యులు, ఏఈవోలు భాస్కర్‌, శంకర్‌, జూనియర్‌ అసిస్టెం ట్లు నర్సింహా, సింహచారి, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.

VIDEOS

logo